USA: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే..

ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరే ఉంటే..ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే...అనర్థాలే జరుగుతాయి. దానికి నిదర్శనమే వాషింగ్టన్ విమాన ప్రమాదం. రీగన్ విమానాశ్రయంలో ట్రాఫిక్ కంట్రోల్ టవర్లో ఒకే సమయంలో రెండు విమానాలను, ఒక్కరే కంట్రోల్ చేయడం వలనే దారుణం జరిగింది.

New Update
US plane collides with Army chopper near Washington all 67 dead

US plane collides with Army chopper near Washington all 67 dead Photograph: (US plane collides with Army chopper near Washington all 67 dead)

అమెరికాలోని వాషింగ్టన్ లో ఉన్న రీగన్ ఎయిర్ పోర్ట్ లో ఒకేసారి అమెరికన్ ఎయిర్ లైన్స్, ఆర్మీ హెలికాఫ్టర్ ల్యాండ్ అవడం వలన భారీ ప్రమాదం ఏర్పడింది. విమానాన్ని హెలికాఫ్టర్ అడ్డంగా ఢీకొట్టడంతో..రెండు ముక్కలైన ఎయిర్ ప్లేన్, హెలికాఫ్టర్ రెండూ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 65 మంది ప్యాసెంజర్లు, నలుగురు సిబ్బంది...ఆర్మీ హెలికాఫ్టర్ లో ఉన్న ముగ్గురు జవాన్లు చనిపోయారు. ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిల్లేదు. ఫ్లైట్ లో ఉన్న 12 మంది ఇంటర్నేషనల్ ఐస్ స్కేటింగ్ ప్లేయర్లు కూడా మరణించారు. 

ట్రాఫిక్ కంట్రోల్ టవర్..

సాధారణంగా ఎయిర్ పోర్ట్ లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు ఉంటాయి. రోజూ ఒకే సమయంలో బోలెడు విమానాలు వస్తాయి, వెళతాయి. వీటన్నింటినీ కంట్రోలర్లు కంట్రోల్ చేస్తుంటారు. వీరిచ్చిన సిగ్నల్స్ ప్రకారం ల్యాండింగ్, టేక్ ఆఫ్ లు అవుతాయి. ఒకదానితో ఒకటి కొలైడ్ అవకుండా ట్రాఫిక్ టవర్ నుంచి కంట్రోల్ చేస్తుంటారు. ఇక్కడ చాలా మంది ఉద్యోగులే పని చేస్తారు. షిఫ్ట్ ల ప్రకారం వీరు చాలా అప్రమత్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటారు. 

Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు

ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరే..

అయితే నిన్న జరిగిన ప్రమాదంలో కంట్రోల్ టవర్ నుంచి సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడమే అని తెలుస్తోంది. హెలికాఫ్టర్, విమానాలను ఒకరే కంట్రోలర్ ఏకకాలంలో నియంత్రించడం వల్లనే తప్పు జరిగిందని చెబుతున్నారు.  ఇద్దరు ఉండాల్సిన విధుల్లో ఒక్కరు మాత్రమే ఉన్నట్లు గుర్తించిన ఇంటర్నేషనల్ ప్రిలిమినరీ ఫెడరల్ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రమాదంపై భద్రతా నివేదిక అందించింది. అయితే దీని మీద విచారణ పూర్తయితే తప్ప ప్రమాదానికి గల కారణం ప్రకటించలేమని  ఎన్టీఎస్‌బీ సేఫ్టీ బోర్డు సభ్యుడు టాడ్‌ ఇన్మాన్‌ చెప్పారు. కానీ ప్రమాదానికి కారణం మాత్రం కచ్చితంగా ఇదేనని ఆయన తెలిపారు. 

Also Read: Cricket: ఇంగ్లాండ్ తో నాలుగు టీ20..ఈరోజైనా కెప్టెన్ బ్యాటింగ్ చేస్తాడా

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు