/rtv/media/media_files/2025/05/06/n9n7dX3IeKUHz57u8Q60.jpg)
Alcatraz Jail
60 ఏళ్ళ కిందట మూతబడిన ఓల్డ్ జైలును మళ్ళీ తెరవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణించారు. కాలిఫోర్నియాలోని ద్వీపంలో ఉండే ఈ జైలును తెరవాలని అధికారులకు ఆదేశాలను కూడా ఇచ్చారు. చాలా కాలంగా అమెరికాలో దుర్గార్గులు, హింసకు పాల్పడినే వారు ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళ వల్ల దేశం చాలా ఇబ్బందులు పడుతోంది. అలాంటి వారి వలన దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే వారిని దూరంగా ఉంచాలని నిర్ణయించాము. కాలిఫోర్నియాలోని ద్వీపలో ఉన్న ఈ జైలును నుంచి నేరస్థులు తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే వారందరినీ అక్కడ పెట్టాలని నిర్ణయించామని ట్రంప్ చెప్పారు.
గతంలో కూడా అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్లను అత్యంత దూరంగా ఉండే జైళ్లలో ఉంచాం. ప్రజలకు ఎటువంటి హాని చేయలేనంత దూరంలో వారిని పెట్టాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి అత్యంత కఠినమైన చర్యలనే తీసుకోవాలని భావిస్తున్నామని ట్రంప్ అన్నారు. అందుకే మళ్లీ ఆ జైలును పునర్నిర్మించి తెరవాలని జైళ్లశాఖ, న్యాయశాఖ, ఎఫ్‌బీఐ, హోంలాండ్ భద్రతా విభాగాలను ఆదేశించామని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు.
Also read : TGSRTC : బస్సు భవన్ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..
Also read : ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
ఇదొక పెద్ద నరకం..
అల్కట్రాజ్ జైలు..ఇదొక అత్యంత కఠినమై జైలు. ఖైదీలకు నరకం లాంటిది. ద రాక్’ అని పిలిచే ఈ జైలులో గ్యాంగ్‌స్టర్ అల్ కాపోన్, జార్జ్ మెషీన్ గన్ కెల్లీ లాంటి కరడుగట్టిన నేరగాళ్లను ఉంచారు. దీనిపై బోలెడు సినిమాలు
కూడా వచ్చాయి. ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి 36 మంది 14 సార్లు ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు. అయితే 1963లో ఈ జైలు నిర్వహణకు చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయని మూసేశారు. కేవలం 29 ఏళ్ళు మాత్రమే ఈ జైలును రన్ చేశారు. ప్రస్తుతం ఇది టూరిస్ట్ ప్లేస్ గా ఉంది.
today-latest-news-in-telugu | usa | america president donald trump | jail | california
Also Read: Israel: హౌతీలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..50 బాంబులతో ప్రతీకార దాడులు
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!