/rtv/media/media_files/2025/05/06/xYykY7hNJCDYHZzYxl9R.jpg)
Israel Attacks On Houthi's
మొన్న ఇజ్రాయెల్‌కు హౌతీలు బిగ్ షాక్ ఇచ్చారు. టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు మిస్సైల్‌స్ తో దాడి చేశారు. హౌతీలు ప్రయోగించిన మిస్సైల్స్ ను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ డోమ్ సిస్టమ్ ఫెయిల్ అయింది. దీని కారణంగా ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులు తీవ్ర గాయాలపాలయ్యారు. హౌతీలు ప్రయోగించిన క్షిపణి బెన్ గురియన్ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 పార్కింగ్ ప్రాంతం దగ్గరలో పడింది. దీంతో ఇజ్రాయెల్ కొంతసేపు తన గగనతలాన్ని మూసేసింది. విమాన సర్వీసులను ఆపేసింది.
Also Read : అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కోసం.. కన్న కొడుకుని అమ్మేసింది!
Also Read : భారత్, పాక్ ఉద్రిక్తతలు... ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన..
ఈరోజు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
హౌతీలు చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈరోజు హౌతీలపై బాంబులో విరుచుకుపడింది. యెమెన్ ఓడరేవు నగరం హొడైదాపై వైమానిక దాడులు ప్రారంభించింది. హౌతీ నియంత్రణలో ఉన్న నగరంలోని ప్రదేశాలను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. దాదాపు 50 బాంబులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోపల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హౌతీలు దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పరతీకారం తీర్చుకుంటామని అనౌన్స్ చేశారు. అన్నట్టుగానే బాంబులతో విరుచుకుపడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఐడీఎఫ్ హౌతీలపై దాడులు చేసింది. ఇకె మీదట కూడా చేస్తుందని నెతన్యాహు స్పష్టం చేశారు. హౌతీలు ఇరాన్ నుంచి దాడి చేస్తున్నారని..యెమెన్‌లో స్థిరపడిన హౌతీలు దుర్మార్గులని ఆయన అన్నారు. హౌతీలు చేసే ప్రతీ దాడి ఇరాన్ చేసిన దాడిగానే పరిగణిస్తామని నెతన్యాహు అన్నారు. దీని ప్రభావం ఆ దేశం మీద కూడా ఉంటుందని స్పష్టం చేశారు. మమ్మల్ని ఎవరైనా కొడితే, మేము వారిపై ఏడు రెట్లు బలంగా దాడి చేస్తాము అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అన్నారు.
🚨 Breaking: Israel 🇮🇱 just obliterated Hodeidah port, the largest port of Yemeni Houthis, with 50 massive bombs 👇 pic.twitter.com/ziHn3djnhb
— Dr. Eli David (@DrEliDavid) May 5, 2025
today-latest-news-in-telugu | isreal | al houthi | attacks
Also Read: Met Gala: మెట్ గాలాలో షారూక్ మెరుపులు..మొదటిసారి
Also Read : ఉగ్రవాదులకు సహాయం.. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు అరెస్టు!