USA: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..మిడిల్ ఈస్ట్ నుంచి తమ సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్న అమెరికా..

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ధ్రువీకరించారు. ఈ కారణంగానే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్న తమ సిబ్బంది వెనక్కు రప్పిస్తోంది అమెరికా.

New Update
Trump

Trump

మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా ప్రజలు, సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇరాన్ తో అణు ఒప్పందం డీల్ కుదరకపోతే ఆ దేశంపై ఇజ్రాయెల్ దాడులు చేయడం కచ్చితమని తెలిపారు. అందుకే అమెరికా ఇరాక్ లో ఉన్న తన రాయబార కార్యాలయాన్ని పాక్షికంగా ఖాళీ చేయడానికి సన్నాహాలు చేస్తోందని చెప్పారు. దీంతో చమురు ధరలు 4శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అలాగే బహ్రెయిన్, కువైట్ నుంచి అమెరికన్లు స్వచ్ఛందంగా వెనక్కు రావడానికి విదేశాంగశాఖ అనుమతి ఇచ్చిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో స్థావరాలతో, ప్రధాన చమురు ఉత్పత్తి చేసే ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ సైనిక ఉనికిని కలిగి ఉందని తెలిపారు. 

Also Read :  YCPకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్..?

Also Read :  పాకిస్తాన్ పై తాలిబాన్ సూసైడ్ డ్రోన్లు...ఎప్పుడైనా అటాక్..

ఇరాన్ పై దాడికి సిద్ధమైన ఇజ్రాయెల్

అమెరికా, ఇరాన్‌ మధ్య అణు ఒప్పందం వివాదం నడుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సంచలన విషయం బయటపడింది. ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌లోని కీలక ప్రదేశాలకు ఆయుధాలు తరలింపు జరగుతున్నట్లు తెలుస్తోంది. గత ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు విదేశీ వ్యవహారాల నిపుణులు మేరీల్యాండ్‌లో క్యాంప్‌ డేవిడ్‌ ఆఫీసులో సమావేశమయ్యారు.  

Also Read :  అక్కడ పూజలు చేశాకే ఫస్ట్ నైట్.. హనీమూన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు రెడీ అవుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంటున్నాయి. దాడులు తీవ్రత ఎంతవరకు ఉంటుంది ? ఎప్పుడు దాడులు చేసే ఛాన్స్ ఉందనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు ఇజ్రాయెల్ తమపై దాడులకు దిగితే కౌంటర్‌ ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆఖరికీ న్యూక్లియర్‌ ఆయుధాన్ని కూడా ఇజ్రాయెల్‌పై ప్రయోగించే ఛాన్స్ ఉందని ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్‌ రఫేల్‌ గ్రోసీ తెలిపారు.

Also Read:  Honey Moon Murder Case: మంగళసూత్రమే పట్టించింది..హనీమూన్ మర్డర్ కేసు వెలుగులోకి మరో విషయం   

 

usa | israel | iran | today-latest-news-in-telugu | america president trump

Advertisment
Advertisment
తాజా కథనాలు