Trump-Modi: మోదీని పొగిడిన ట్రంప్‌.. అమెరికా-భారత్‌ సంబంధాలపై యూటర్న్

తాజాగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ గొప్ప ప్రధాని అంటూ ప్రశంసించారు. ఆయనతో ఉన్న వ్యక్తిగత సంబంధాల గురించి ట్రంప్‌ వివరించారు. భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు.

New Update
Trump praises Modi

Trump praises Modi

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇటీవల భారత్‌, రష్యాకు దూరమయ్యామని ట్రంప్‌ భావోద్వేగ పోస్టు కూడా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ గొప్ప ప్రధాని అంటూ ప్రశంసించారు. ఆయనతో ఉనన వ్యక్తిగత సంబంధాల గురించి ట్రంప్‌ వివరించారు. భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ఓ రిపోర్టర్‌ అడిగాడు. 

Also Read: ఏడుసార్లు ట్రాఫిల్‌ రూల్స్‌ ఉల్లంఘించిన సీఎం కారు.. డిస్కౌంట్‌తో జరిమానా చెల్లింపు

దీనిపై స్పందించిన ట్రంప్ కచ్చితంగా సిద్ధంగా ఉన్నామని స్పష్టతనిచ్చారు. '' నేను ఎప్పటికీ అదే కోరుకుంటాను. ప్రధాని మోదీతో ఎప్పుడూ స్నేహంగానే ఉంటాను. ఆయనొక గొప్ప ప్రధానమంత్రి. కానీ ఇప్పుడు ఆయన చేస్తుంది మాత్రం నాకు నచ్చడం లేదు. భారత్-అమెరికా మధ్య ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయి. వీటిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని'' ట్రంప్ అన్నారు. అంతేకాదు ఇటీవల అమెరికాకు మోదీ వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.   

Also Read: ఏకంగా ఎర్రకోటపైనే కన్నేసిన దొంగలు.. విలువ చేసే కలశం మాయం.. ఎన్ని కోట్లంటే?

చైనా చీకట్లోకి వెళ్లిన భారత్, రష్యాను మేము కోల్పోయామని ఇటీవల తన ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ పోస్టు చేశారు. ఈ అంశంపై విలేకరి ప్రశ్నించారు. దీనికి స్పందించిన ట్రంప్ రష్యా భారత్‌ నుంచి పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందన్నారు. ఇది తనను చాలా నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. రష్యా వద్ద చమురు కొనకూడదని తాను భారత్‌కు చెప్పినట్లు గుర్తుచేశారు. వాళ్లు వినకపోవడంతోనే భారత దిగుమతులపై భారీగా టారీఫ్‌లు విధించినట్లు స్పష్టం చేశారు. అయితే తాను విధించిన 50 శాతం సుంకాలు ఎక్కువని కూడా ట్రంప్ అంగీకరించారు.  

Also Read: గొప్ప ప్రధాని అనడాన్ని అభినందిస్తున్నా..ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందన

ఇదిలాఉండగా 2026 జీ20 శిఖరాగ్ర సదస్సు గురించి కూడా ట్రంప్‌ కీలక విషయం వెల్లడించారు. ఈసారి మియామిలో తన సొంత గోల్ఫ్‌ రిసార్ట్‌లోనే ఈ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ సమ్మిట్‌ జరగనుంది. మరోవైపు అమెరికాలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ను కూడా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్‌గా మారుస్తూ ట్రంప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా దాని ఉత్తర్వులపై కూడా సంతకం చేశారు. 

Also Read: పాకిస్తాన్ కరాచీలో ఘనంగా గణేష్ నిమజ్జనాలు.. గణపతి విగ్రహాలతో కళకళలాడుతున్న వీధులు!

Advertisment
తాజా కథనాలు