Venezuela: ఆ హామీ ఇస్తే..దేశాన్ని వీడేందుకు సిద్ధం..వెనిజులా అధ్యక్షుడు మదురో

వెనిజులా అధ్యక్షుడు మదురో వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. దీనికి సమాధానంగా తాను దేశం నుంచి వెళ్ళిపోతానని..కానీ కొన్ని షరతులు మాత్రం అంగీకరించాల్సిందేనని మదురో అన్నారు.

New Update
maduro

వెనెజువెలా(venezula) అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolás Maduro) తనంతట తానుగా గద్దె దిగిపోవాలని, లేకపోతే సైనిక చర్యతో గద్దె దింపాల్సి ఉంటుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(america president donald trump) అల్టిమేటం జారీచేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలువరించింది. అంతకు ముందు వెనిజులా గగనతలాన్నిమూసివేస్తున్నట్లుట్రంప్ ప్రకటించారు. ఎయిర్ లైన్స్, పైలట్లు, డ్రగ్ డీలర్లు, హ్యూమన్ ట్రాఫికర్లకుగగనతలం బంద్ అయిందని చెప్పారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ గురించి వెనెజులా అధ్యక్షుడు మదురోకుతెలుసునని..ఆయనే దానికి సహకరిస్తున్నారని ట్రంప్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అలాగే వెనెజులా సముద్రంలో అమెరికా భారీగా యుద్ధ నౌకలను, బలగాలను కూడా మోహరించింది.

Also Read :  టర్కీ సంచలనం.. డ్రోన్‌తో యుద్ధ విమానాన్నికూల్చేసిందిగా !

ఆంక్షలు ఎత్తేస్తేనే..

ఈ నేపథ్యంలో వెనెజులా అధ్యక్షుడు నికోలస్మదురో...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ మాట్లాడారు. దాదాపు 15 నిమిషాల సేపు మాట్లాడినట్లు తెలుసతోంది. ఇందులో మదురో తాను తన కుటుంబంతో సహా దేశాన్ని విడిచి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు సమాచారం. అయితే దాని కంటే ముందు తనకు, తన కుటుంబానికి ఆంక్షల నుంచి పూర్తిగా ఉపశమనం లభించాలని ఆయన కోరారని చెబుతున్నారు. యూఎస్‌ విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు నుంచి తాను ఎదుర్కొంటున్న కేసును మూసివేయడం వంటి వాటి గురించి మదురో...ట్రంప్ తో మాట్లాడారని తెలుస్తోంది. దీంతోపాటు అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి 100 మందికి పైగా వెనెజువెలా అధికారులపై విధించిన ఆంక్షల నుంచి యూఎస్‌ ఉపశమనం కల్పించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు బానిసత్వంతో కూడిన శాంతిని తాము కోరుకోవడం లేదని నికోలస్‌ అంతకు ముందు వ్యాఖ్యానించారు. కారకాస్‌లో జరిగిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. విదేశాల నుంచి వస్తోన్న ఒత్తిడికి, ఆధిపత్యానికి తమ దేశం లొంగదన్నారు. తాము శాంతిని కోరుకుంటున్నామని.. అయితే, అది సమానత్వం, స్వేచ్ఛతో కూడి ఉండాలన్నారు.

అయితే రాయిటర్స్ కథనం ప్రకారం మదురో అడిగిన వాటిని ట్రంప్ తిరస్కరించారు. అలాగే ఆయన తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు ఒక వారం రోజులు గడువు విధించినట్లు వార్తలు వచ్చాయి. అవి కూడా గత శుక్రవారంతో ముగియడంతో వెనెజులాలో ఆపరేషన్ కు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు.

Also Read: BSF: ఎల్వోసీలో ఇప్పటికీ టెర్రర్ లాంచ్ ప్యాడ్ లు, 100కు ఉగ్రవాదులు ..బీఎస్ఎఫ్

Advertisment
తాజా కథనాలు