/rtv/media/media_files/2025/12/01/turkey-2025-12-01-21-48-51.jpg)
Turkey's Unmanned Jet Makes History With Radar-Guided Air-To-Air Kill
యుద్ధ విమానాలకు గగనతలంలో తమ లక్ష్యాలను నేలకూల్చే సామర్థ్యం ఉంటుంది. ఇప్పటిదాకా ఇలాంటి మానవసహిత యుద్ధవిమానాలు మాత్రమే ఈ విన్యాసాన్ని చేశాయి. తాజాగా తుర్కియేకు చెందిన ఓ మానవరహిత డ్రోన్ తరహా యుద్ధవిమానాన్ని పరీక్షించగా తన లక్ష్యాన్ని విజయవంతంగా నేలకూల్చింది. ఇదొక కీలక మైలుగా నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గగనతల పోరాటాన్ని ఇది మార్చేస్తుందని అంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినోప్ ఫైరింగ్ రేంజ్ వద్ద సాగర జలాలపై ఈ పరీక్షను నిర్వహించారు. కిజిలెల్మా అనే డ్రోన్‌కు జెట్ ఇంజిన్‌తో నడిచే గగనతల విమానాన్ని కూల్చేసే పనిని అప్పగించారు. ఆ యుద్ధవిమానంలో మురాద్ ఏఈఎస్‌ఏ రాడర్ ఉంది. ఎక్కువ దూరంలో ఉండే లక్ష్యాలను ఇది నిరంతరం పరిశీలిస్తుంది. ఇది వేగంగా కదులుతున్న టార్గెట్ డ్రోన్‌ను ఎలాంటి సాయం లేకుండానే గుర్తించింది. ఆ తర్వాత వెంటనే కిజిలెల్మా ఫైటర్ జెట్.. తన రెక్కల కింద ఉన్న గోక్డోగన్ బియాండ్ విజువల్ రేంజ్ (BVR) క్షిపణిని ప్రయోగించింది.
Also Read: భయపెడుతున్న 2025.. ఈ ఏడాదిలో 16 వేలకు పైగా భూకంపాలు..
ఇది రాడర్ మార్గనిర్దేశానికి అనుగుణంగా వెళ్లి లక్షిత డ్రోన్‌ను కూల్చేసింది. టాయ్‌గన్ టార్గెటింగ్ వ్యవస్థ దీనికి ఉపయోగపడింది. అయితే ఈ ప్రయోగం జరిగే సమయంలో కిజిలెల్మా డ్రోన్ వెంట అయిదు ఎఫ్ 15 యుద్ధవిమానాలు కూడా వెళ్లాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే కిజిలెల్మా డ్రోన్‌కు రాడార సిగ్నేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శత్రు రాడర్లు దీన్ని ఈజీగా గుర్తించలేవు. అంతేకాదు దీనికి చాలాదూరంగా ఉన్న శత్రు యుద్ధవిమానాలను కూడా గమనించే సామర్థ్యం ఉంటుంది. దాడులు చేయడంలోను, శత్రు దాడులను తిప్పికొట్టడంలో ఇది సత్తాను చాటగలదు.
🚨🇹🇷 Turkey's Bayraktar Kızılelma drone shoots down aircraft during testing
— Sputnik India (@Sputnik_India) November 30, 2025
According to its manufacturer, this is a historic first, as most drones developed globally are designed primarily for striking ground targets — not engaging airborne threats. pic.twitter.com/yj21WuLv62
అంతేకాదు ఈ డ్రోన్‌లో శక్తిమంతమైన ఇంజిన్‌ను అమర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా వినియోగించారు. దీంతో ఇది విమానవాహక నౌకలపై కూడా ఇది సొంతంగా టేకాఫ్, ల్యాండ్ అవ్వగలదు. ఇదిలాఉండగా బేరక్తర్ అనే సంస్థ కిజిలెల్మాను అభివృద్ధి చేసింది. దీనికి అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు ఉంది. 2023-24లో ఎగుమతుల ద్వారా ఏకంగా 180 కోట్ల డాలర్లు సంపాదించింది.
Follow Us