Trump-Musk: ఎక్స్ పై ట్రంప్‌ దావా..రూ.86 కోట్లతో మస్క్‌ డీల్‌!

నాలుగేళ్ల క్రితం క్యాపిటల్‌ భవనం పై దాడి నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ నకు సంబంధించిన ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, ఎక్స్‌ ఖాతా లపై నిషేధం విధించింది.ఈ క్రమంలో మరోసారి వచ్చిన ట్రంప్‌ తో సెటిల్‌మెంట్‌ చేసుకునేందుకు ఆ సంస్థలు రెడీ అయ్యాయి.

New Update
trump-musk

trump-musk

నాలుగేళ్ల క్రితం క్యాపిటల్‌ భవనం పై దాడి నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ నకు సంబంధించిన ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, ఎక్స్‌ ఖాతా లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ట్రంప్‌ ఆయా సంస్థలపై దావా వేశారు. ఈ క్రమంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ తో సెటిల్‌మెంట్‌ చేసుకునేందుకు ఆ సంస్థలు సిద్ధమయ్యాయి.అందులో భాగంగా ఎక్స్‌ 10 మిలియన్‌ డాలర్ల కు ట్రంప్‌ తో డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Trump-Hamas: ట్రంప్‌ వార్నింగ్‌ ని పట్టించుకోని హమాస్‌...బందీలను విడుదల చేసేదే లేదంటూ ప్రకటన!

ఈ మేరకు పలు వార్తా పత్రికలు వెల్లడిస్తున్నాయి. 2021లో క్యాపిటల్‌ భవనం పై ట్రంప్‌ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ,యూట్యూబ్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ ,ఎక్స్‌ ఖాతాల పై నిషేధం విధించారు. అనంతరం 2023 లో వాటిని పునరుద్దరించారు. అయితే అంతకుముందు ట్రంప్‌ ఆ సంస్థలపై దావా వేశారు.

Also Read: Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి ఊహించని షాకిచ్చిన పోలీసులు... 7 సెక్షన్ల కింద కేసులు

వీటిని సెటిల్‌ చేసుకునేందుకు ఆ టెక్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇటీవల మెటా సంస్థ 25 మిలియన్‌ డాలర్లకు సెటిల్‌మెంట్‌ కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే తరహాలో ఎక్స్‌  సైతం ట్రంప్‌ తో డీల్‌కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే దీని పై అటు ఎక్స్‌ సంస్థ కానీ, ఇటు ట్రంప్‌ బృందం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మస్క్‌ ట్రంప్‌ నకు పూర్తి మద్దతు ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్‌ కోసం ఆయన ప్రచారాలు సైతం నిర్వహించారు. దీంతో మస్క్‌ కు పాలకవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ట్రంప్‌.డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ శాఖ సారథిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే ఈ విభాగం ప్రధాన పని. అయితే ట్రంప్‌ ప్రభుత్వంలో మస్క్‌ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వీటిని ట్రంప్‌ ఖండిస్తూ వస్తున్నారు. 

Also Read: Supreme Court: మీరు విదేశాలకు వెళ్తే తిరిగొస్తారన్న నమ్మకం లేదు..ఇంద్రాణీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Also Read: Odisha rapper:భార్యతో గొడవలు..ప్రముఖ రాపర్‌ ఆత్మహత్య!

Advertisment
తాజా కథనాలు