Odisha rapper:భార్యతో గొడవలు..ప్రముఖ రాపర్‌ ఆత్మహత్య!

జగ్గర్నాట్‌గా ప్రసిద్ధి చెందిన ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో విభేదాలు, గొడవల వల్లే అభినవ్‌ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

New Update
odisha rapper

odisha rapper

జగ్గర్నాట్‌గా ప్రసిద్ధి చెందిన ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వైవాహిక జీవితంలో తలెత్తిన విభేదాలు.. భార్య మోపిన తప్పుడు ఆరోపణలు కారణంగా తీవ్ర మనస్తాపం చెందడంతో అభినవ్ సింగ్ విషం తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  బెంగళూరులోని కడుబీసనహళ్లిలో అపార్ట్‌మెంట్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Also Read:Bihar: తాగుబోతు భర్తతో విసిగిపోయి... లోన్ రికవరీ ఏజెంట్‌తో భార్య రెండో పెళ్లి.. చివరికి బిగ్ ట్విస్ట్!

భార్యతో విభేదాల కారణంగానే...

సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యతో తలెత్తిన విభేదాల  కారణంగానే రాపర్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా పోలీసులు వెల్లడించారు. 

Also Read: Fake reporters: జర్నలిస్టుల పరువు తీశారు కదరా.. రిపోర్టర్లమంటూ దందాలు.. ఏడుగురిపై కేసు బుక్

భార్య తప్పుడు ఆరోపణలు చేయడంతోనే రాపర్ విషం తాగినట్లుగా తెలుస్తుందన్నారు. పోస్ట్ మార్టం తర్వాత… మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అతని కుటుంబానికి అప్పగించారు.  అభినవ్ సింగ్ బెంగళూరులో ఒక ప్రవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అభినవ్ సింగ్ ఆత్మహత్యకు కారణమైన భార్య, మరో 10 మంది పేర్లను ఫిర్యాదులో బాధితుడి తండ్రి చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. 

భార్య, ఇతరులు మానసికంగా,ఆర్థికంగా  హింసించడం వల్లే అభినవ్ చనిపోయాడని తండ్రి ఆరోపించారు. ‘జగ్గర్నాట్’ అనే రంగస్థల నామంతో అభినవ్ సింగ్ ఒడియాలో సుపరిచితుడు. ఆయన పాడిన కటక్ ఆంథమ్ అనే పాట సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో అతడు మంచి పాపులర్ సంపాదించాడు.

Also Read: Supreme Court: మీరు విదేశాలకు వెళ్తే తిరిగొస్తారన్న నమ్మకం లేదు..ఇంద్రాణీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Also Read: Mood Of The Nation: సర్వేలో కాంగ్రెస్కు బిగ్ షాక్..  ఖర్గే కంటే సచిన్ పైలట్కు ఎక్కువ మార్కులు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు