Trump: పాక్, ఇండియా సరిహద్దులకు వెళ్లొద్దు.. పౌరులకు ట్రంప్ కీలక సూచన!

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌, భారత్ మధ్య ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో యూఎస్ పౌరులు రెండు దేశాల సరిహద్దుల్లోకి వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేశారు. ఇప్పటికే వీసా తీసుకున్న వారుసైతం టూర్ క్యాన్సిల్ చేసుకోవాలని ఆదేశించారు.

New Update
ind, pak trump

ind, pak trump Photograph: (ind, pak trump)

America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌, భారత్ మధ్య ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో తమ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పౌరులెవరు పాక్, భారత్ బార్డర్ లోకి వెళ్లొద్దంటూ యూఎస్ గవర్నమెంట్ అడ్వైజరీ జారీ చేసింది. 

ఉగ్రదాడులు జరిగే ప్రమాదం..

ఈ మేరకు పాక్ లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువ ఉంది. టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం పొంచివుంది. వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిది. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న వారు భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లకు మాత్రం వెళ్లొద్దని సూచించింది. మార్కెట్లు, రవాణా కేంద్రాలతోపాటు పలు ఏరియాల్లో పౌరులు, పోలీసులు, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

Also Read:  UP: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

అలాగే పాక్ నుంచి ఇండియాలో అడుగుపెట్టేందుకు ఉన్న ఒకే అధికారిక మార్గం వాఘా బార్డర్. భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలి. వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదు అని స్పష్టం చేసింది. ఇక పాకిస్థాన్‌ పౌరుల విషయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెరికాకు వచ్చే పాక్ పౌరులపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా పాక్‌ పౌరులపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు