Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్‌

ఇటీవల అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో పాలస్తీన్ మద్దతుదారులు చేసిన దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దేశ భద్రత దృష్ట్యా 12 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు.

New Update
Trump issues travel ban on 12 countries, Saving US from foreign terrorists

Trump issues travel ban on 12 countries, Saving US from foreign terrorists

ఇటీవల అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో.. ఇజ్రాయెల్‌ బందీలు విడుదల చేయాలని నిర్వహించిన ఓ వేడుకలో పాలస్తీన్ మద్దతుదారులు చేసిన దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ భద్రత దృష్ట్యా 12 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌పై సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read: చిన్న దేశమైనా రష్యాని చిత్తు చేస్తున్న ఉక్రెయిన్.. వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్..!

ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో  ఆ12 దేశాలకు చెందిన వాళ్లు ఇకనుంచి అమెరికాలోకి రాలేరు. ఆ దేశస్థులపై పూర్తిగా ఆంక్షలు ఉంటాయి. ఈ లిస్ట్‌లో ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్, చాడ్, కాంగో రిపబ్లిక్, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్ , యెమెన్ దేశాలు ఉన్నాయి. అలాగే బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా దేశాలకు పాక్షిక ప్రవేశ ఆంక్షలు కూడా విధించింది ట్రంప్‌ ప్రభుత్వం. 

Also Read: విషాదం.. ఇంజెక్షన్‌ వికటించి అయిదుగురు మృతి..

''భద్రతాపరంగా మాకు ముప్పు ఉండే ఏ దేశం నుంచైన బహిరంగ వలసలను అనుమతించము. అందుకే నేను యెమెన్, సొమాలియా, హైతి, లిబ్యా లాంటి ఇతర దేశాలపై ట్రావెల్ ఆంక్షలు విధిస్తూ ఎగ్జిక్యూటీవ్‌ ఆర్టర్‌పై సంతకం చేశానని'' ట్రంప్‌ ప్రకటించారు. ''విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మాకు హానీ చేసే వాళ్ల నుంచి అమెరికన్లు కాపాడేందుకు ట్రంప్‌ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారని'' వైట్‌ హౌస్‌ ప్రతినిధి అబిగెయిల్ జాక్సన్ ఎక్స్‌లో తెలిపారు. 

Also Read: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?

ఇదిలాఉండగా ట్రంప్ ఇలా విదేశాలపై ట్రావెల్ బ్యాన్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2017లో కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముస్లిం మెజారిటీ దేశాలైన ఇరాక్, ఇరాన్, సిరియా, లిబ్యా, సోమాలియా, యెమెన్ దేశాలపై ఈ నిషేధం విధించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్‌ 2021లో ఈ విధానాన్ని రద్దు చేశారు. 

telugu-news | national-news | usa | Travel Ban | rtv-news 

Advertisment
Advertisment
తాజా కథనాలు