Ukraine: చిన్న దేశమైనా రష్యాని చిత్తు చేస్తున్న ఉక్రెయిన్.. వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్..!

రష్యాని తట్టుకొని యుద్దంలో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అనేక దేశా సాయం అందుతుంది. రష్యాని దెబ్బతీయాలన్న కుట్రతో అమెరికా ఆయుధాలు సమకూరుస్తోంది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి.

New Update
Ukraine zl

Ukraine zl Photograph: (Ukraine zl)

చిన్న దేశం ఉక్రెయిన్ ప్రపంచ విస్తీర్ణంలోనే అతిపెద్ద దేశమైన రష్యాని వణికిస్తోంది. 2022 ఫిబ్రవరిలో యుద్ధంలోకి అడుగు పెట్టిన ఉక్రెయిన్ వెనక్కి తిరిగి చూడటం లేదు. ఎన్ని ప్రాణాలు పోయినా, భారీ ఆస్తి నష్టం జరిగినా వెనకడుగు వేయడం లేదు. రష్యాపై యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్‌కు అన్నీ విధాల బలమైన దేశాల నుంచి సాయం అందుతుంది. కాబట్టే రష్యాని తట్టుకొని యుద్ధంలో నిలుస్తోంది. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటూనే అమెరికా ఉక్రెయిన్‌ను ఎగేస్తోంది. వార్ ప్రారంభమైనప్పుటి నుంచి 2024 చివరి వరకు అమెరికా 69 బిలియన్లు డాలర్లు ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం చేసింది. ట్రంప్ అధికారంలోకి రాగానే ఉక్రెయిన్‌కు ATACMS మిస్సైల్ సిస్టమ్ పంపించాడు. పైకేమో ఉక్రెయిన్, రష్యా దేశాల శాంతి చర్చల మధ్యవర్తిగా ఉంది. అమెరికాకు పోటీగా ఉన్న రష్యాని దెబ్బ తీయాలనే ఆ దేశం ఉక్రెయిన్‌కు మద్దతు చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అమెరికా, రష్యా ప్రచ్చన్న యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Also Read :  నితీష్కు బిగ్ షాక్.. బీహార్‌లో గెలిచేది అతనే.. సంచలన సర్వే

పెద్దన్న ఆయుధాలు..

అమెరికానే కాదు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాలు రష్యా మీద పోరాడటానికి ఉక్రెయిన్ వెనుక నిలబడ్డాయి. తాజాగా ఉక్రెయిన్ రష్యాపై చేసిన డ్రోన్ అటాక్‌లో రష్యాలో 40 విమానాలు కూలిపోయాయి. 100కు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ రష్యాపై విరుచుకుపడింది. భారీ నష్టాన్ని ఆ దేశానికి మిగిల్చింది. రష్యా సొంత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా వాటిని అడ్డుకోలేక పోయింది. 2026 నాటికి ఉక్రెయిన్‌కు లక్ష డ్రోన్లు సరఫరా చేస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది. రష్యా దురాక్రమణాన్ని ఎదుర్కొడానికి సాంకేతిక ఆధారిత సైన్యం, వ్యూహాత్మక రక్షణ సమీక్షను అవసరమని ఆ ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తూ మాట్లాడింది. 

Also Read :  రీల్స్ పిచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృతి

120 బిలియన్ డాలర్లు ఉక్రెయిన్ కోసమే ఖర్చు

2022  ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు 250 బిలియన్ల డాలర్లకు పైగా విలువైన సైనిక, మానవతా, ఇతర ఆర్థిక సహాయాన్ని కేటాయించాయి. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, ఆర్థిక సహాయంలో అమెరికా ముందుగా ఉంది. జర్మన్ థింక్ ట్యాంక్ కీల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. 2022 ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా మిలిటరీ ఫండ్‌గా 69 బిలియన్ డాలర్లు అందించింది.

ఉక్రెయిన్‌కు ఆయుధాలు, పరికరాలు మరియు ఆర్థిక సహాయంతో సహా సైనిక సహాయంలో అమెరికా ముందుంది. అమెరికా సుమారు120 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని డేటా చెబుతుంది. ఇది ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందిన సాయంలో 43శాతం. జర్మన్ థింక్ ట్యాంక్ కీల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం..  జర్మనీ13.6 బిలియన్ డాలర్లు, UK10.8 బిలియన్ డాలర్లు, డెన్మార్క్ 8.1 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ 6.3 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చాయి.

Also Read :  కన్నడ భాష వివాదం..  కమల్‌ హాసన్‌ సంచలన నిర్ణయం

స్టాక్‌హోమ్‌ ఇంటర్‌నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రీ) నివేదిక ప్రకారం.. 

2022లో రష్యాతో యుద్ధం ఆరంభమయ్యాక కనీసం 35 దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేశాయి. ప్రపంచంలోనే ఆయుధాల దిగుమతిదారిగా ఉక్రెయిన్ మొదటి స్తానంలో ఉంది. ఇంకా అనేకరకాల రక్షణ సామగ్రి అందబోతోంది. 2020-24లో ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్‌ వాటా 8.8 శాతంగా ఉంది. ఈ దేశానికి అమెరికా (45శాతం) నుంచే ఎక్కువ ఆయుధాలు అందాయి. జర్మనీ (12 శాతం), పోలండ్‌ (11శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఆయుధాల ఎగుమతుల్లో అమెరికా అగ్రస్థానం. తర్వాత ఫ్రాన్స్, మూడో స్థానంలో రష్యా. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా పెరిగి, 43 శాతానికి చేరింది. రష్యా ఎగుమతులు ఏకంగా 64 శాతం మేర పడిపోయాయి. 2020-24లో రష్యా ప్రధానంగా 33 దేశాలకు ఆయుధాలను విక్రయించింది. ఇందులో మూడింట రెండొంతులు భారత్‌ (38 శాతం), చైనా (17 శాతం), కజకస్థాన్‌ (11 శాతం)కే వెళ్లాయి.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ ఎగమతిదారుగా ఎదిగిన ఫ్రాన్స్‌.. 65 దేశాలకు రక్షణ సామగ్రిని అందించింది. ఇందులో అత్యధికంగా 28 శాతం.. భారత్‌కు అందాయి. 2015-19 నుంచి 2024 కాలంలో భారత ఆయుధ దిగుమతులు 9.3 శాతం మేర తగ్గాయి.

Also Read :  ఆశావర్కర్‌పై రేప్.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష

 

ukraine | latest-telugu-news | ukraine russia war | russia declares war on ukraine | russia drone attack ukraine | ukraine russia conflict | American Arms

Advertisment
Advertisment
తాజా కథనాలు