/rtv/media/media_files/2025/11/13/bangladesh-2025-11-13-18-41-47.jpg)
Bangladesh tribunal to deliver verdict against ex-PM Sheikh Hasina on Nov 17
బంగ్లాదేశ్‌లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై నవంబర్ 17న తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతుండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి యూనస్ ప్రభుత్వం రాజధాని ఢాకాలో భద్రతను పెంచింది. 2024లో జరిగిన అల్లర్లు ఎలాంటి పరిణామాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం భారీగా భద్రతను మోహరించింది.
Also Read: ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్..ఆత్మహుతికి పాల్పడింది ఉమర్‌నే..
అంతేకాదు ఈ తీర్పును వెలువరించనున్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చుట్టూ కూడా భద్రతను పెంచారు. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ అయిన అవాలీ లీగ్.. ఢాకాలో ఏకంగా లాక్‌డౌన్‌కే పిలుపునిచ్చింది. గురువారం అక్కడికి పోలీసులు, బోర్డర్ గార్ట్ సెక్యూరిటీని భారీ స్థాయిలో మోహరించారు. ఢాకా ప్రవేశ మార్గాల దగ్గర కూడా చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.
Bangladesh ICT to deliver verdict against Sheikh Hasina on November 17
— ANI Digital (@ani_digital) November 13, 2025
Read @ANI Story | https://t.co/kngzwUUiMN#Bangladesh#ICT#verdict#SheikhHasinapic.twitter.com/X1acjr1qxL
Also Read: పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు.. కోర్టు సంచలన తీర్పు!
ఇదిలాఉండగా ప్రస్తుతం షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటన చేసింది. మరోవైపు ఇప్పటికే ఆమె మెడకు చాలా కేసులు చుట్టుకున్నాయి. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనేదానికి అక్కడి ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అవామీ లీగ్ మద్దతుదారులు అల్లర్లకు దిగే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తును పెంచింది.
Follow Us