Muskan Rastogi: తల్లి చేసిన పాపానికి 6ఏళ్లు జైలులో పసిపాప.. మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్

2025 మార్చిలో భర్తని చంపి డ్రమ్‌లో పెట్టిన మీరల్‌ హత్య కేసు మళ్లీ వార్తళ్లోకి వచ్చింది. ప్రధాన నిందితురాలు, భార్య ముస్కాన్ జైలు శిక్ష అనుభవిస్తూ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప ఆరేళ్ల వరకు తల్లితోపాటు జైళ్లోనే జీవితం గడపాలి.

New Update
meerut case

2025 మార్చిలో భర్తని చంపి డ్రమ్‌లో పెట్టిన మీరల్‌ హత్య కేసు మళ్లీ వార్తళ్లోకి వచ్చింది. ప్రధాన నేరస్తురాలు ముస్కాన్ జైలు శిక్ష అనుభవిస్తూ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప ఆరేళ్ల వరకు తల్లితోపాటు జైళ్లోనే జీవితం గడపాలి. ప్రియుడు ద్వారా ఆ బిడ్డకు ముస్కాన్ జన్మనిచ్చినట్లు అత్తింటి వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎన్‌ఏ టెస్ట్‌కు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ ఏడాది మార్చి 4న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి భర్త సౌరభ్ రాజ్‌పుత్‌(Meerut Husband Case)ను హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్‌లో వేసి దానిని సిమెంట్‌తో నింపారు. కొనాళ్ల తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. నిందితురాలు ముస్కాన్‌తోపాటు ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి శిక్ష విధించింది. నేరం రుజువు అయ్యే నాటికి ముస్కాన్ గర్భం((muskan pregnant)) దాల్చిందని తెలిసింది. నిందితురాలు ముస్కాన్ నవంబర్ 24న ఆడ పిల్లకు జన్మనిచ్చింది. జైలులో ఉన్న ఆమె తన బిడ్డకు ‘రాధ’ అని పేరు పెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సౌరభ్ రాజ్‌పుత్ పుట్టిన రోజు కూడా నవంబర్ 24 రోజే ఆ పాప పుట్టింది.

Also Read :  ఐబొమ్మ రవి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పైరసీ చేయలేదు సినిమాలు కొన్నాడు

Muskan Rastogi Pregnant

భర్త హత్య తర్వాత సిమ్లా వెళ్లి ముస్కాన్ ఆమె ప్రియుడు, సాహిల్‌ అక్కడ ఎంజాయ్‌ చేశారు. మార్చి 17న మీరట్‌కు తిరిగి వచ్చారు. మృతదేహం ఉన్న బ్లూ డ్రమ్‌ పడేసేందుకు ప్రయత్నించగా భర్త సౌరభ్‌ హత్య విషయం బయటపడింది. దీంతో ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాటి నుంచి వారిద్దరూ జైలులో ఉన్నారు.

మరోవైపు ఏప్రిల్‌లో జైలులోని ఖైదీలకు నిర్వహించిన సాధారణ వైద్య పరీక్షల్లో ముస్కాన్‌ గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. తాజాగా నెలలు నిండటంతో సోమవారం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో నవంబర్‌ 24న భద్రత మధ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆడ పిల్లకు ముస్కాన్‌ జన్మనిచ్చినట్లు గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ షాగున్ తెలిపారు. తన బిడ్డకు ‘రాధ’ అని ఆమె పేరు పెట్టినట్లు చెప్పారు. మగ పిల్లవాడు పుడితే ‘కృష్ణ’ అని పేరు పెడతానని ముస్కాన్‌ చెప్పిందన్నారు. బుధవారం బిడ్డతో పాటు ఆమెను జైలుకు పంపుతామని వెల్లడించారు. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్‌కు జైలులోని మహిళా బ్యారక్‌లో ప్రత్యేక వసతులు కల్పిస్తామని జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. నవజాత శిశువుకు అవసరమైన దుస్తులు, పోషకాహారం, వైద్య సదుపాయాలు అందిస్తామని చెప్పారు. ఆ బిడ్డకు ఆరేళ్లు వచ్చే వరకు తల్లితో పాటు జైలులో ఉండవచ్చని అన్నారు.

మరోవైపు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ముస్తాన్‌, యాదృచికంగా సౌరభ్‌ పుట్టిన రోజైన నవంబర్‌ 24న ఆడ పిల్లకు జన్మనిచ్చింది. అయితే ప్రియుడు సాహిల్‌ ద్వారా ఆమె గర్భం దాల్చినట్లు అత్తింటి వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టిన ఆడ పిల్లతో పాటు తొలి సంతానమైన కుమార్తెకు కూడా డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు.  దీని కోసం తాము కోర్టును ఆశయిస్తామని సౌరభ్‌ తల్లి, సోదరుడు మీడియాతో అన్నారు.

Also Read :  వివాదంలో పరకామణి...అసలు పరకామణి కేసు ఏంటి?

Advertisment
తాజా కథనాలు