India-Pak: అయోధ్యపై పాక్ కారుకూతలు..స్ట్రాంగ్ కౌంటరిచ్చిన భారత్

అయెధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం, దానిని ప్రధాని చేతులు మీదుగా నిర్వహించడంపై పక్క దేశం పాకిస్తాన్ విషం కక్కింది. దీనికి భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ఇతరులకు నీతులు చెప్పే నైతికత మీకెక్కడదని నిలదీసింది.

New Update
randheer

అయోధ్యలో రామమందిరం నిర్మాణ పూర్తయిన సందర్భంగా ధ్వజారోహణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనిని భారత ప్రధాని మోదీ తన చేతుల మీదుగా నిర్వహించారు. దీనిపై నోటికొచ్చినట్టు మాట్లాడింది దాయాది పాకిస్తాన్. మతపరమైన మైనారిటీలపై ఒత్తిడి, ముస్లిం వారసత్వాన్ని తుడిచిపెట్టే చర్యగా అభివర్ణించింది. బాబ్రీ మసీదును కూల్చి రామమందిరాన్ని కట్టారని అంది. ముస్లిం సాంస్కృతిక ,మత వారసత్వాన్ని క్షీణింపజేయడానికి ఉద్దేశపూర్వకప్రయత్నాలని విమర్శించింది. భారతీయు ముస్లింలను అణిచివేసే చర్యగా పేర్కొంది. భారత్ లో పెరుగుతున్న ఇస్లాఫోఫోబియాను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పాకిస్తాన్ అంది. ఇస్లామిక్ వారసత్వాన్ని కాపాడటంలో, అన్ని మైనారిటీల మతపరమైన, సాంస్కృతిక హక్కుల రక్షణను నిర్ధారించడంలో ఐక్యరాజ్యసమితి దాని సంబంధిత అంతర్జాతీయ సంస్థలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చెప్పింది.

మాకు నీతులు చెప్పే అర్హత ఉందా..

పాకిస్తాన్ వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. మైనార్టీల అణచివేసి, మతతత్వ రికార్డులు కలిగిన దేశానికి ఇతరులకు నీతులు చెప్పే నైతికతఎక్కడదని నిలదీసింది. ఎదుటి వాళ్ళ గురించి వేలెత్తి చూపెట్ట ముందు వారి ఇంటినచక్కబెట్టుకోవాలని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్చురకలంటించారు. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం అర్హమైనవి కావని ఆయన అన్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మతతత్వం, మైనారిటీలపై అణచివేత వంటి ట్రాక్ రికార్డు ఉన్న పాక్‌కు ఇతరులకు నీతులు చెప్పే అర్హత లేదని దుయ్యబట్టారు. తమకు ఉపన్యాసాలు ఇచ్చే ముందు తన దేశంలోని మానవ హక్కుల రికార్డ్ పై పాక్ దృష్టి సారిస్తే బావుంటుందని రణధీర్ హితవు పలికారు.

Advertisment
తాజా కథనాలు