Trump: ఆ దేశ అధినేత పిచ్చోడు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఆదివారం ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. దీంతో పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టినట్లు ప్రవరిస్తున్నారని ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తే రష్యా పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

New Update
Trump calls Putin 'crazy' after largest Russian attack on Ukraine

Trump calls Putin 'crazy' after largest Russian attack on Ukraine

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన రష్యా సైన్యం ఆ దాడిని తిప్పికొట్టండడంతో పుతిన్ తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఉక్రెయిన్‌పై మిసైళ్లు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడుతోంది. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ స్పందిస్తూ పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టినట్లు ప్రవరిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఏ ప్రయత్నం చేసినా.. అది రష్యా పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్‌లో దీనిపై పోస్ట్‌ చేశారు. '' నాకు పుతిన్‌తో  మంచి సంబంధాలు ఉన్నాయి. కొన్నిసార్లు మాత్రం ఆయనకు ఏం అవుతుందో అర్థం అవ్వడం లేదు. పుతిన్ పూర్తిగా పిచ్చిపట్టినట్లు ప్రవరిస్తున్నారు. అవసరం లేకున్నా కూడా చాలామందిని చంపేస్తున్నారు. 

Also read: భారత్ ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు.. అమెరికా నిఘా సంస్థ సంచలన రిపోర్ట్!

Also Read :  ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్.. ఎక్కడంటే?

Trump Calls Putin

కేవలం సైనికుల గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు. కారణం లేకుండానే ఉక్రెయిన్ నగరాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఆయన ఉక్రెయిన్‌లో కొంత భాగాన్ని మాత్రమే కాదు.. దేశం మొత్తం స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన దృష్టిలో ఇలా చేయడం సరైనదే కావొచ్చు. కానీ ఇలా చేస్తే మాత్రం రష్యా పతనానికే దారి తీస్తుందని మండిపడ్డారు.  

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీరుపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు. '' జెలెన్‌స్కీ మాట్లాడే విధానం తన దేశానికి ఎలాంటి మేలు చేయదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా సమస్యలను సృష్టిస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని ఇప్పుడైనా ఆపాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల క్రితం నేను అధ్యక్షుడిగా ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వచ్చేది కాదు. ఈ ఉద్రిక్తతలను ఆపేందుకు నేను ప్రయత్నిస్తున్నానని'' ట్రంప్‌ తెలిపారు. 

ఆదివారం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు ప్రాంతాలే టార్గెట్‌గా రష్యా ఏకంగా 367 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. ఇరుదేశాల మధ్య మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. అమెరికా ఈ విషయంలో మౌనంగా ఉంటే పుతిన్‌ను ఎంకరేజ్‌ చేసినట్లు అవుతుందని జెలెన్‌స్కీ తీవ్ర విమర్శలు చేశారు.  

Also Read: బంగ్లాదేశ్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దు.. పౌరులకు చైనా వార్నింగ్.. ఎందుకంటే?

Also Read :  బంగ్లాదేశ్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దు.. పౌరులకు చైనా వార్నింగ్.. ఎందుకంటే?

 telugu-news | rtv-news | zelensky | russia-ukraine-war

Advertisment
Advertisment
తాజా కథనాలు