India-China: భారత్ ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు.. అమెరికా నిఘా సంస్థ సంచలన రిపోర్ట్!

తైవాన్‌ను ఆక్రమించేందుకు చైనా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అమెరికాకు చెందిన ఓ నివేదిక పేర్కొంది. 2030 నాటికి చైనాకు 1000 వరకు అణ్వాయుధాలు ఉంటాయని తెలిపింది. ఇండియా చైనాను ప్రధాన శత్రువుగా భావిస్తోందని వెల్లడించింది.

New Update
China Projected To Have 1,000 nuclear warheads, Viewed As 'Primary Adversary' By India, Says US Report

China Projected To Have 1,000 nuclear warheads, Viewed As 'Primary Adversary' By India, Says US Report

చైనా తన సైనిక శక్తిని వేగంగా ఆధునికీకరిస్తోందని అమెరికా నివేదిక వెల్లడించింది. తైవాన్‌ను ఆక్రమించేందుకు మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని పేర్కొంది. 'వరల్డ్‌వైడ్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌' పేరుతో అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ ఈ రిపోర్టును విడుదల చేసింది. భారత్‌కు పొరుగు దేశాలతో ఉన్న ముప్పు అంచనాలు కూడా ఈ నివేదిక వివరించింది. 2030 నాటికి చైనా దగ్గర కనీసం 1000 వరకు అణ్వాయుధాలు ఉంటాయని తెలిపింది. 

Also Read: మధ్యప్రదేశ్‌లో దారుణం.. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం

China Projected To Have 1,000 Nuclear Warheads

'' ఇండియా చైనాను ప్రధాన శత్రువుగా భావిస్తోంది. దీనిక తగ్గట్లుగానే భారత ప్రభుత్వం రక్షణ పరమైన నిర్ణయాలు ఉంటున్నాయి. చైనాను ఎదుర్కొనేందుకు తన సైనిక బలం పెంచుకోవడంపై ఫోకస్‌ పెట్టింది. తూర్పు ఆసియాలో బలమైన దేశంగా ఉండేందుకు చైనా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. తైవాన్, ఫిలిప్పీన్స్‌ వంటివాటిపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. వాణిజ్యం, దౌత్యం, భద్రత పరంగా చూసుకుంటే అమెరికా నాయకత్వాన్ని చైనా సవాల్ చేస్తోంది. 

Also Read: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

చైనా 2025లో తమ మిల్టరీ బడ్జెట్‌ను 5.2 శాతం నుంచి 247 బిలియన్‌ డాలర్లు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేసింది. కానీ దాని రక్షణ రంగంపై చేస్తున్న ఖర్చు ఇంతకన్నా ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. గతేడాది దాదాపు 304-377 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనాలున్నాయి. ఇప్పటికే చైనా వద్ద ఆపరేషనల్ న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌కు 600 దాటాయి. 2030 నాటికి ఈ సంఖ్య వెయ్యికి పైగా ఉండొచ్చు. 2035 నాటికి బీజింగ్ తన సైనిక శక్తిని పెంచుకుంటూనే ఉంటుందని'' అమెరికా రిపోర్టు వెల్లడించింది. 

Also Read: హైదరాబాద్ తో పాటు ఆ 7 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర

Also Read: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. డబ్బులు కోసం మహిళను సీసాతో పొడిచి ఆపై..?

china | rtv-news | nuclear weapon

Advertisment
Advertisment
తాజా కథనాలు