/rtv/media/media_files/2025/05/26/opI5e59ZxZred9wF2WXG.jpg)
No 'foreign wife' shopping, China warns against marriage scams in Bangladesh
చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ యువతులతో అక్రమ వివాహాలు చేసుకోవద్దని తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. చైనాలో యువతుల కొరత ఉండటంతో అక్రమ మార్గంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో బీజింగ్ ఈ చర్యలు చేపట్టింది. వివాహాల స్కామ్స్‌పై జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. మోసపూరిత క్రాస్ బార్డర్ డేటింగ్ వీడియోలు, అనధికారిక మ్యాట్రిమోనీలు, సమాచారానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చైనా దౌత్య కార్యాలయం హెచ్చరించింది.
బంగ్లాదేశ్ యువతులతో అక్రమ వివాహాలు చేసుకోవద్దని, అక్కడ పెళ్లిళ్లు చేసుకునేముందు అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలని సూచనలు చేసింది. మరోవైపు చైనాలో గత కొన్నేళ్ల నుంచి పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఉద్యోగాల్లో స్థిరపడ్డ తర్వాతే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని అక్కడివారు భావిస్తున్నారు. యువతుల సంఖ్య కూడా అక్కడ తక్కువగానే ఉంది. ప్రస్తుతం 3 కోట్ల మంది యువతులకు జీవిత భాగస్వాములు దొరకని పరిస్థితి ఉంది.
Also read: భారత్ ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు.. అమెరికా నిఘా సంస్థ సంచలన రిపోర్ట్!
Also Read : అమెరికాలో మరోసారి కాల్పులు.. 11 మందికి పైగా..?
China Warns Against Marriage Scams In Bangladesh
ఈ వివాహాల కోసం బంగ్లా యువతులను చైనాకు అక్రమరవాణా చేస్తున్నారని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. చట్ట విరుద్ధంగా ఈ పెళ్లిళ్ల తంతు నడుస్తోందని, ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులకు దారితీయొచ్చని ఎంబసీ తన అడ్వైజరీలో పేర్కొంది. సరిహద్దు ఆవల లైంగిక సంబంధాలు, వివాహాల బాధితులు వెంటనే పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీకి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ తరహా పెళ్లిళ్లు చేసుకుంటే.. మానవ అక్రమరవాణా కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇదిలాఉండగా బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం చూసుకుంటే మానవ అక్రమ రవాణాకు పాల్పడిన కేసులో దోషిగా తేలితే 7 ఏళ్లు జైలు శిక్ష ఉంటుంది. కేసు తీవ్రత ఎక్కువగా ఉంటే యావజ్జీవ, మరణశిక్షలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని క్రిమినల్ నెట్‌వర్క్‌లు కూడా బంగ్లా యువతులను భారత్‌కు అక్రమ రవాణా చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఇలాంటి కేసులోనే ఢాకాలో 11 మంది అరెస్టయ్యారు. యువతుల అక్రమ రవాణకు టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లు వినియోగించినట్లు అప్పట్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.
Also read: అమెరికాలో మరోసారి కాల్పులు.. 11 మందికి పైగా..?
Also Read : మేడ్చల్‌లో విషాదం.. కరెంట్ వైర్ ప్రమాదంలో యువతి మృతి
bangladesh | telugu-news | national-news
Follow Us