/rtv/media/media_files/2026/01/18/trump-vs-khamenie-2026-01-18-09-22-48.jpg)
అమెరికా, ఇరాన్(iran) లమధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(trump vs khamenei) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరసనలకు మద్దతిచ్చిన ట్రంప్‌ను నేరస్థుడిగా పరిగణిస్తున్నామన్న ఆయన.. ఇరాన్‌లో ఆందోళనలకు, ప్రాణ నష్టానికి ఆయనే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల వెనుక అమెరికా కుట్ర దాగుంది. ఇరాన్‌ను అణచివేయడం, ఆధిపత్యం చలాయించడం వారి లక్ష్యం. ఆందోళనల వేళ అమెరికా అధ్యక్షుడు స్వయంగా వ్యాఖ్యలు చేస్తూ నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. అందుకే ఆయన్ను నేరస్థుడిగా పరిగణిస్తున్నామని ఖమేనీ అన్నారు.
Also Read : ఇండియా మాస్టర్ ప్లాన్.. ఈ ప్రాజెక్టులతో చికెన్ నెక్ సేఫ్!
దశాబ్దాల పాలనను అంతమొందించాలి..
సుప్రీం లీడర్ ఖమేనీ వ్యాఖ్యలపై అమెరికా(america) అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్ లో కొత్త నాయకత్వం కోసం వెతకాల్పిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆ దేశంలో నిరసనలు ప్రస్తుతం తగ్గు ముఖం పట్టాయి కానీ..గత మూడు వారాలుగా వేలాది మంది నిరసకారులు మరణించారు. అందుకే ఆయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్ల పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ అన్నారు. పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఒక దేశ నాయకుడిగా, ఇరాన్ ను పూర్తిగా నాశనం చేయడం, గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో హింసను ఖమేనీ ఉపయోగించారని ఆరోపించారు. ఇరాన్ నాయకత్వం తన దేశాన్ని సక్రమంగా నడపడంపై దృష్టి పెట్టాలి... నియంత్రణను కొనసాగించడానికి వేలాది మందిని చంపకూడదు అని ఆయన అన్నారు. నాయకత్వం అనేది గౌరవానికి సంబంధించినది కానీ భయం, మరణం కలిగించకూడదని ట్రంప్ అన్నారు. ఖమేనీ ఒక అనారోగ్ వ్యక్తని అభివర్ణించారు. పేలవమైన నాయకత్వం కారణంగా ప్రపంచంలోనే ఇరాన్ నివసించడానికి అత్యంత చెత్త దేశంగా మారిందని అన్నారు.
దాడి క్యాన్సిల్ చేసుకున్న అమెరికా..
దీనికి ముందు టెహ్రాన్‌పై దాడుల ప్రణాళికలను అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ప్రస్తుతానికి తాము దాడి చేయాలనుకోవట్లేదని ట్రంప్ హామీ ఇచ్చినట్లు పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి ఒకరు మీడియాకు చెప్పారు. దీంతో ఇరు దేశాల మధ్యనా ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి. దానికి తోడు ట్రంప్ హెచ్చరికలు కారణంగా ఇరాన్ కూడా ఆందోళనకారులు మరణశిక్షలను రద్దు చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. దీంతో ఇరాన్ కూడా తన గగనతలాన్ని మళ్ళీ తెరిచింది. అలాగే ఇరాన్‌కు దగ్గరలోని ఖతార్‌లో ఉన్న తమ కీలక అల్-ఉదెయిద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి ఖాళీ చేసిన అమెరికా సిబ్బంది తిరిగి తమ స్థావరాలకు తిరిగి వచ్చారని రాయిటర్స్ కథనం ప్రచురించింది. అంతేకాదు.. అల్-ఉదెయిద్‌లో భద్రతా హెచ్చరికల స్థాయిని కూడా తగ్గించినట్లు కూడా చెప్పింది.
Also Read: Air Plane Missing: మరో మలేసియా విమానం మిస్సింగ్..11 మంది ప్రాణాలు గాల్లోనే..
Follow Us