Air Plane Missing: మరో మలేసియా విమానం మిస్సింగ్..11 మంది ప్రాణాలు గాల్లోనే..

మలేసియాలో మరో విమానం మిస్ అయింది. 11 మందితో వెళుతున్న ATR 42-500 విమానం ఇండోనేషియాలోని ప్రముఖ ద్వీపాలైన జావా, సులవేసి మధ్య ఉన్న పర్వత ప్రాంతాల్లో కనిపించకుండా పోయింది. ప్రస్తుతం దీని గురించి వెతుకులాట జరుగుతోంది.

New Update
malasia flight

మలేసియా విమానాలు(Malaysia Flights) మిస్సవ్వడం కొత్తేమీ కాదు. రెండు, మూడేళ్ళకొకసారి ఈ దేశ విమానాలు కనిపించకుండా పోతుంటాయి(Air Plane Missing). వాటితో పాటూ అందులో ప్రయాణిస్తున్న వారు కూడా. తాజాగా మరో మలేసియా విమానం మిస్ అయింది. 11 మంది తో ప్రయాణిస్తున్న ఇండోనేషియా(indonesia) ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ATR 42-500 కు చెందిన విమానం నిన్న మిస్ అయింది. ఇండోనేషియాలోని ప్రముఖ ద్వీపాలైన జావా, సులవేసి మధ్య ఉన్న పర్వత ప్రాంతాల్లో ఇది కనిపించకుండా పోయింది. మారోస్ దగ్గరలో ఎయిర్ ట్రాఫిక్ తో సంబంధాలు కోల్పోయింది.  ప్రస్తుతం ీ విమానం గురించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ATR 42‑500 అనేది 42 నుండి 50 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల ప్రాంతీయ టర్బోప్రాప్ విమానం. దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని పర్వత జిల్లా అయిన మారోస్‌లోని లియాంగ్-లియాంగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 1:17 గంటలకు విమానం చివరిసారిగా ట్రాక్ చేయబడిందని అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. 

Also Read :  మచాదోకు రెడ్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్..అందులో ఏముందో తెలుసా!?

విమానంలో అధికారులు..

ఇండోనేషియా వైమానిక దళ హెలికాప్టర్లు, డ్రోన్లు..ఇంకా గ్రౌండ్ యూనిట్ల మద్దతుతో  మిస్ అయిన విమానం కోసం తీవ్రంగా వెతుకులాట కొనసాగుతోంది. బులుసారౌంగ్ పర్వతంపై హైకర్లు చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలను కనుగొన్నట్లు, ఎయిర్‌లైన్ లోగోకు అనుగుణంగా ఉన్న గుర్తులలను చూసినట్లు చెబుతున్నారు. చిన్న పాటి మంటలు కూడా చూశామని చెప్పారు. దీంతో రెస్క్యూ బృందలు ఆ ప్రాంతానికి తరలి వెళ్ళాయి. సుల్తాన్ హసనుద్దీన్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళుతున్నప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పైలట్లను వారి అప్రోచ్ అలైన్‌మెంట్‌ను సరిచేయమని సూచించిన కొద్దిసేపటికే విమానం అదృశ్యమైందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత రేడియో సంబంధాలు తెగిపోయాయని మరియు కంట్రోలర్లు అత్యవసర విపత్తు దశను ప్రకటించారని ఏటీఆర్ అధికారిణి ఎండా పూర్ణమా సరి చెప్పారు. ఆ విమానంలో ఎనిమిది మంది సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని.. వీరంతా ఇండోనేషియా సముద్ర వ్యవహారాలు,  మత్స్య మంత్రిత్వ శాఖ అధికారులని  తెలిపారు.

Also Read: A.R. Rahman: బాలీవుడ్ పై కామెంట్స్..వివాదంలో సంగీత దర్శకుడు రెహమాన్..

Advertisment
తాజా కథనాలు