Tiktok: అమెరికాలో టిక్‌ టాక్‌ బంద్‌!

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ అమెరికాలో తన సేవల్ని నిలిపివేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ నేరుగా యూజర్లకు తెలియజేసింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపింది.

New Update
TikTok: అమెరికా నిషేధించినా.. నెం.1 గా టిక్ టాక్!

TIKTOK: ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ అమెరికాలో తన సేవల్ని నిలిపివేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ నేరుగా యూజర్లకు తెలియజేసిందిజ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపింది.

Also Read: Israel-Hamas: ఇజ్రాయెల్‌- హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందం..హెజ్‌బొల్లా ఏం చెప్పిందంటే ?

ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అమెరికాలో టిక్‌ టాక్‌ ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఈ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నాం అంటూ టిక్‌ టాక్‌ తన యూజర్లకు సందేశం పంపింది. అయితే యాప్‌ మాత్రం తాత్కాలికంగా అందుబాటులో ఉంటుందని చెబుతోంది.

Also Read: Foreign Minister Jaishankar: ఉగ్రవాద క్యాన్సర్ పాకిస్థాన్ రాజకీయాన్ని మింగేస్తోంది!

ఇదిలా ఉండగా..2017 లో ప్రారంభమైన టిక్‌ టాక్‌ ను భారత్‌ సహా అనేక దేశాలు నిషేధించాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు దీని వినియోగం పై ఆంక్షలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కొవాల్సిందేనని బిల్లులోని సారాంశం.

బైట్‌ డ్యాన్స్‌ కు డెడ్‌ లైన్‌...

అనంతరం అమెరికా సుప్రీం కోర్టు కూడా టిక్‌ టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ కు డెడ్‌ లైన్‌ ఇచ్చింది. జనవరి 19 లోగా యూఎస్‌ టిక్‌ టాక్‌ ను విక్రయిస్తారా? లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా? నిర్ణయించుకోవాలని  హెచ్చరికలు జారీ చేసింది.మరోవైపు ,అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత బీజింగ్‌ పై కఠిన ఆంక్షలు విధిస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో టిక్‌ టాక్‌ సేవల్ని ఆపేస్తున్నట్ఉల సంస్థ యూజర్లకుసమాచారం ఇచ్చింది. 

Also Read: RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!

Also Read:  Foreign Minister Jaishankar: ఉగ్రవాద క్యాన్సర్ పాకిస్థాన్ రాజకీయాన్ని మింగేస్తోంది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు