/rtv/media/media_files/2025/01/18/eYJu1Xz2s7EIkLxhvhdj.jpg)
Hezbollah chief Naim Kasim
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం జరిగినట్లు అధికారిక వర్గాలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందంపై తాజాగా హెజ్‌బొల్లా అగ్రనేత నయీం ఖాసిం సానుకూలంగా స్పందించారు. హమాస్‌కు అభినందనలు తెలిపారు. '' పాలస్తీనా ప్రజల చేసిన త్యాగాలు.. వాళ్ల లక్ష్యాలను అంతం చేయాలనుకున్న ఇజ్రాయెల్ ప్రయత్నాలను అడ్డుకున్నాయి. అందుకే ఈ ఒప్పందం సాధ్యమయ్యింది. ఇజ్రాయెల్ తాను అనుకున్నది సాధించలేకపోయిందని'' నయీం ఖాసి అన్నారు.
Also Read: RSS చీఫ్ మోహన్ భాగవత్‌పై రాహల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత కొంతకాలంగా భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే గాజాలో శాంతి స్థాపన కోసం ఇరువైపుల అంగీకారం వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందానికి, బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తులకు తమ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపిందని హమాస్ వెల్లడించింది. ముందుగా 6 వారాల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ బలగాలు క్రమంగా గాజా నుంచి వెళ్లిపోతాయి.
Also Read: చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాం..అంతా 20 నిమిషాల్లోనే!
ఇదిలాఉండగా.. 2023న అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. అలాగే హమాస్ మిలిటెంట్లు 250 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసుకున్నారు. అప్పటినుంచి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటిదాకా 46 వేల మందికి పైగా పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుండటంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .
Also Read: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!