Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?!

ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

New Update
 drugs

drugs

ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్షవిధించే ఛాన్సులు కనపడుతున్నాయి. ముఖ్యంగా గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లు.. ఇండోనేషియా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వాళ్లు ఓడను పట్టుకుని సోదాలు చేయగా.. వంద కిలోలకు పైగా మాదకద్రవ్యాలు దొరికాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు అక్కడి జైల్లోనే ఉండగా.. వీరికి మరణ శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

Also Read: Punjab National Bnak Scam:బెల్జియంలో ఛోక్సీ..రప్పించేందుకు భారత్‌ విశ్వ ప్రయత్నాలు!

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టైన ముగ్గురు భారతీయులకు ఇండోనేషియా కోర్టు మరణశిక్ష విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వర్గాలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. 2024 జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో డ్రగ్స్ తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఇండోనేషియా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ఏకంగా 106 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడినట్లు నాడు ఇండోనేషియా పోలీసులు తెలిపారు. వీటిని అక్రమంగా తరలిస్తున్న భారతీయులు రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, గోవిందసామి విమలకంధన్‌ను అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు.

Also Read: America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!

ఈ కేసులో ఓడ కెప్టెన్ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయగా.. అతడు విచారణకు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ముగ్గురు నిందితులతో పాటు.. ఈ కేసులో విచారణకు హాజరుకాని ఓడ కెప్టెన్‌కు మరణ శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుపై ఏప్రిల్ 15వ తేదీన తీర్పు వెలువడనున్నట్లు తెలుస్తోంది. నిందితులు ముగ్గురు తమిళనాడుకు చెందిన వారిగా తెలుస్తోంది. అరెస్టైన ముగ్గురు భారతీయల తరఫున భారతీయ న్యాయవాది జాన్ పాల్ కేసును వాదిస్తున్నారు. ఈయన కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం.

అయితే ఓడ కెప్టెన్‌కు తెలియకుండా ఓడలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను తరలించడం సాధ్యం కాదని, కావాలనే కుట్రలో భాగంగానే ముగ్గురు భారతీయులను ఈ కేసులో ఇరికించినట్లు భారతీయుల తరుఫు న్యాయవాది ఇండోనేషియా కోర్టు ముందు వాదనలు వినిపించారు. వీరిని అమాయకులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అసలైన నేరస్థులు తప్పించుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు మీడియా వర్గాలు తమ కథననాల్లో పేర్కొన్నాయి. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే విధంగా గతంలో పలుమార్లు డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఇండోనేషియా ప్రభుత్వం భారతీయులకు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Also Read: Horoscope: ఈరోజు ఈ రాశివారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది!

Also Read: Tummala Nageswara rao:తెలంగాణ రైతులకు పెద్ద షాక్‌.. వారికి రుణమాఫీ లేదని చెప్పిన మంత్రి తుమ్మల..!

 indonasia | drugs | drugs-case | indians | national | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు