Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!

నాన్నంటే అంతులేని ప్రేమ, వెలకట్టలేని త్యాగాలకు నిదర్శనం! నేడు ఫాదర్స్ డే సందర్భంగా, మనసులను కదిలించిన అలాంటి కొన్ని తెలుగు సినిమాలను గుర్తు చేసుకుందాం.

New Update

Father's Day 2025:  నాన్నంటే అంతులేని ప్రేమ, వెలకట్టలేని త్యాగాలకు చిరునామా. జీవితంలో నిశ్శబ్దంగా ఆయన చేసే ఎన్నో ఎన్నో త్యాగాలు పిల్లల భవిష్యత్తుకు బాటలు! బతుకంతా పిల్లల సంతోషమే తన ఆనందంగా జీవించే నిస్వార్థమైన జీవి నాన్న🥰. నిజజీవితంలోనే కాదు సినిమాల్లోనూ  తండ్రి ప్రేమను, ఆయన అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకులు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా, మనసులను కదిలించిన అలాంటి కొన్ని తెలుగు సినిమాలను గుర్తు చేసుకుందాం.

ఫాదర్ సెంటిమెంట్ సినిమాలు 

నాన్నకు ప్రేమతో 

ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం తండ్రీ కొడుకుల బంధాన్ని, తండ్రి గౌరవాన్ని కాపాడటానికి కొడుకు చేసే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపింది. రాజేంద్ర ప్రసాద్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. కేవలం డబ్బు, పేరు కంటే కుటుంబ విలువలు, ఆత్మాభిమానం ఎంత ముఖ్యమో ఈ సినిమా చక్కగా వివరించింది.

బొమ్మరిల్లు

దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో తండ్రి తన బిడ్డల భవిష్యత్తు కోసం పడే తపననను చక్కగా చూపించారు. కొన్ని సార్లు తండ్రి అతి ప్రేమను  ఇబ్బందిగా ఫీల్.. చివరికి ఆ ప్రేమ ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చూపించారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ హైలైట్ 

జెర్సీ  

నాని నటించిన ఈ సినిమాలో  తండ్రి త్యాగాన్ని, తన కొడుకు ఆశయం కోసం పడే తపనను హృదయాలను కదిలించేలా చూపించారు.  తండ్రిని పెద్ద క్రికెటర్ గా చూడాలనే కొడుకు కలను తీర్చడానికి చివరి శ్వాస వరకు పోరాడిన తండ్రి ప్రేమ అనిర్వచనం.  

హాయ్ నాన్న 

నాని, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ చిత్రం తండ్రి–కూతురు మధ్య ఉండే అనంతమైన ప్రేమను , బలమైన అనుబంధాన్ని చూపించింది.  అనారోగ్యంతో బాధపడుతున్న కూతురిని కాపాడుకోవడానికి తండ్రి పడే తపనను ఎంతో చక్కగా చూపించారు.  ఈ  సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగంలో ముంచెత్తుతుంది.

డాడీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాలో కూతురి కోసం పరితపించే తండ్రి పాత్రను అద్భుతంగా పోషించారు. తన కూతురి కోరికలు తీర్చడానికి, ఆమెను సంతోషంగా ఉంచడానికి ఒక తండ్రి ఎంత దూరం వెళ్తాడో ఈ సినిమా చక్కగా చూపింది. ఇవి ఉదాహరణ మాత్రమే ఇలా ఫాధర్ సెంటిమెంట్ తో మరెన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

Also Read: Allu Arjun: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు