పవన్‌కు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై సభ్యులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో గల్ఫ్ దేశాలకు చెందిన ఎన్నారైలు సమావేశమయ్యారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్‌తో భేటీ అయిన ఎన్నారైలు.. పవన్ రైతులను ఆదుకుంటున్నారని, తాము కుడా రైతులకు ఆదుకోవాలని వచ్చినట్లు తెలిపారు. అందుకోసం ఎన్నారైలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కోటి రూపాయల చెక్కును అందజేశారు.