/rtv/media/media_files/2025/08/13/student-upset-over-exam-score-assaults-teacher-2025-08-13-10-55-59.jpg)
Student upset over exam score assaults teacher
Maths Teacher: గురువంటే విద్యార్థికి మార్గదర్శకుడు. తల్లిదండ్రి తర్వాత అంతటి స్థానం గురువుకే సొంతం. అలాంటి గురువుకు ఏమిచ్చిన రుణం తీరదు. ఒకప్పుడు టీచర్ అంటే ఎనలేని గౌరవం ఉండేది. దూరంగా టీచర్ కనిపించారంటే భయంతో దాక్కూనేవారు. కానీ, కాలం మారింది. టీచర్ అంటే గౌరవం ఇవ్వకపోగా వారిపట్ల అమర్యాదగా ప్రవర్తి్స్తూ విద్యావ్యవస్థకే కళంకంగా మారుతున్నారు.
Also Read : నిజం సింహం లాంటిది.. KTR లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే
రెండు మార్కులు తక్కువ వేసిందని టీచర్‌పైనే దారుణానికి ఒడిగట్టాడో ప్రభుద్ధుడు. కోపంతో ఆమెపై క్లాస్ రూములోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. 20 మార్కులకు గాను 18 మార్కులు వేసినప్పటికీ ఆ యువకుడికి సంతోషం అనిపించలేదు. తనకు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందలేదు. తనకు మార్కులు రావడానికి కారణాలను అన్వేషించకుండా రెండు మార్కుల కోసం లెక్కల టీచర్‌తో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆమెను కొట్టాడు. ఈ సంఘటన థాయ్‌లాండ్ దేశంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
Also Read: అమెరికాలో ఇంటిపై పడిన ఉల్క.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు!
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉతాయ్ థానీ ప్రాంతానికి చెందిన ఆర్టీ అనే మహిళ ఓ స్కూల్లో లెక్కల టీచర్‌గా పని చేస్తోంది. ఆగస్టు 5న స్కూల్లో నిర్వహించిన మిడ్ టర్మ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఫలితాలను ప్రకటించింది. అందులో భాగంగా ఓ విద్యార్థికి 20 మార్కుకు గాను 18 మార్కులు వచ్చాయి. ఆ మార్కులతో అతడు సంతృప్తి చెందలేదు. తనకు కావాలనే మార్కులు తక్కువ వేశారని ఆవేదనతో నేరుగా ఆర్టీ దగ్గరకు వెళ్లాడు. తనకు ఎందుకు ఆ రెండు మార్కులు వేయలేదని ఆమెను నిలదీశాడు. ఆమె ఏదో సర్ధిచెప్పిన వినలేదు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. దీంతో రెచ్చిపోయిన విద్యార్థి ఆర్టీపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. గొడవ జరుగుతున్న విషయం తెలిసి పక్క క్లాసులో ఉన్న ఓ మగ టీచర్ అక్కడికి వచ్చాడు. ఆమెపై దాడి చేస్తున్న విద్యార్థిని నిలువరించాడు. అప్పటికే ఆర్టీ కళ్లు, తల, రిబ్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూములో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ సీసీటీవీ దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఆర్టీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. ‘ నా పై అనవసరంగా దాడిచేసిన ఆ యువకుడిని వదిలిపెట్టను. చట్టపరంగా పోరాటం చేస్తాను. అత్యంత కఠినమైన చర్యలు తీసుకునేలా చేస్తాను’ అని అంటూ ఆ పోస్టులో రాసింది. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువుకు గౌరవం ఇవ్వలేని ఆ విద్యార్థి పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి వారికి సరైన విధంగా బుద్ధి చెప్పాలని అంటున్నారు.
Also Read : ఖమ్మంకు ఓ న్యాయం.. నల్లగొండకో న్యాయమా?: మంత్రి పదవిపై మరోసారి భగ్గుమన్న కోమటిరెడ్డి!