నిజం సింహం లాంటిది.. KTR లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పంపిన లీగల్ నోటీసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నిజం సింహం లాంటిది, తనను తానే రక్షించుకుంటుందని సంజయ్ వాఖ్యనించారు.

New Update
bandi (1)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పంపిన లీగల్ నోటీసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నిజం సింహం లాంటిది, తనను తానే రక్షించుకుంటుందని సంజయ్ వాఖ్యనించారు. ఫోన్ ట్యాపింగ్‌ ద్వారా జీవితాలు నాశనం చేసిన నేరస్థులు తప్పించుకోలేరని సంజయ్ చెప్పారు. నిజం..ఎప్పటికైనా గెలిచి తీరుతుందన్నారు. కాగా ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా

బండి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. ఆయనకు ఇవాళ నోటీసులు పంపించారు.  కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదంటూ నోటీసుల్లో వెల్లడించారు. ఈ నోటీసులో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, దీని వల్ల తన పరువుకు నష్టం వాటిల్లిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా బండి సంజయ్ స్పందించకపోతే సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కేటీఆర్ తరపు ణ్యాయవాదులు హెచ్చరించారు.