/rtv/media/media_files/2025/08/12/komatireddy-rajgopal-2025-08-12-13-13-55.jpg)
KOMATIREDDY RAJGOPAL
KOMATIREDDY RAJGOPAL : తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్‌చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా ముఖ్యనేత అడ్డుకున్నారన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారని 11 మంది ఎమ్మెల్యే ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పా..? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఖమ్మంకు ఓ న్యాయం.. నల్లగొండకో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు.
ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్
మునుగోడు మండలం ఎలగలగూడెం లో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెలికంటి సత్యంతో కలిసి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేం ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని..-- నన్ను పార్టీలోకి తీసుకునే ముందు తెలియదా..? అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తీరు ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య..ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
Also Read:అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!
అన్నదమ్ములిద్దరమూ సమర్థలమేనని మా ఇద్దరికి మంత్రి పదువులు ఇస్తే తప్పేంటి..? ఆని ప్రశ్నించారు.-- ఏ పదవి ఇచ్చినా తన కోసం కాదని, మునుగోడు ప్రజల కోసమేనన్నారు. మీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడే ఇవ్వండి.. కానీ మునుగోడు అభివృద్ధిని మాత్రం ఆపొద్దు అని సూచించారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టెనన్నారు. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా అన్నారు, మీరు మాటిచ్చారు ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని సూచించారు. ఇస్తామన్నమాట ఆలస్యమైంది సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు.ఎందుకు కుదరటం లేదు సమీకరణలు?ఎవరడ్డుకుంటున్నారు రాకుండా అంటూ క్వశ్చన్ చేశారు.
ఇది కూడా చూడండి: Coolie vs War 2 Bookings: 'కూలీ' అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్.. తలైవా ర్యాంపేజ్ మాములుగా లేదుగా..!
పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని తెలియదా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పని చేశాను. నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను. నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వ దవాఖానకు పోతే పేదోడికి న్యాయం జరగాలి. ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయన్నారు. పేదవారికి అండగా ఉండాలని నేను కష్టపడుతున్నా నన్నారు. ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి:Trump: అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?