/rtv/media/media_files/2025/02/02/z9vlid03zryZCD3049JK.jpg)
Spiders rain Photograph: (Spiders rain)
పిడుగుల వర్షం, చేపల వర్షం గురించి వినే ఉంటారు. కానీ సాలెపురుగుల వర్షం గురించి మీరు వినడం ఇదే తొలిసారి ఏమో. ఎందుకంటే బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలోని సావో థోమ్ దాస్ లెట్రాస్ అనే చిన్న పట్టణంలో సాలెపురుగుల వర్షం కురిసింది. వందల కంటే ఎక్కువగా జీవులు ఎనిమిది కాళ్లతో ఆకాశం నుంచి పడుతున్నాయి.
ఇది కూడా చూడండి: CM Chandrababu: ఇలాంటి బావమరిది దొరకడం నా అదృష్టం.. చంద్రబాబు ఎమోషనల్!
Hundreds of spiders 'rain down' from the sky in Brazil. pic.twitter.com/YcZsS5At4l
— Daily Mail Online (@MailOnline) January 31, 2025
హారర్ సినిమాల్లో కనిపించేటట్లుగా.. ఆకాశం నుంచి జీవులు పడిపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన వారంతా కూడా అసలు ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇది కూడా చూడండి: RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్!
బ్రెజిల్‌లో ఇది సర్వసాధారణమే..
బ్రెజిల్‌లో ప్రతీ ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు వేడి వాతావరణం ఉంటుంది. దీనివల్ల భారీ సంఖ్యలో సాలె పురుగులు ఆకాశం అంతటా వలలు వేస్తాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతీ ఏడాది ఇలా జరగడం సాధారణమే అని అంటున్నారు. దీని వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం కూడా లేదట. గతంలో బ్రెజిల్ అంతటా కూడా ఈ సాలెపురుగుల వర్షం కనిపించింది.
ఇది కూడా చూడండి: AP Crime: కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే!
Horror moment spiders appear to rain from the sky pic.twitter.com/ycTmnKU9p4
— The Sun (@TheSun) January 30, 2025
ఇది కూడా చూడండి: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!