/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-01T125445.586-jpg.webp)
RC16
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - బుచ్చిబాబు (Butchi Babu) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ RC16. దాదాపు ఏడాదికి పైగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది దసరా లేదా దీపావళి వరకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
20 ఏళ్ళు వెనక్కి వెళ్లి పాత పద్దతిలో షూటింగ్..
మీరు పాత సినిమాలూ చూసే ఉంటారు కదా? అప్పట్లో సినిమాల చిత్రీకరణ కోసం ఫిల్మ్ రీల్ ని వాడేవారు. దీనికోసం నిర్మాతలకు బాగా ఖర్చు అయ్యేది. అందువల్ల నటీనటులు కూడా రీల్ వేస్ట్ చేయకుండా సింగిల్ టెక్ లోనే డైలాగులు చెప్పేవారట. కానీ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. రీల్ కెమెరాల స్థానంలో ఇప్పుడు డిజిటల్ కెమెరాలు వచ్చాయి. దాదాపు 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో డిజిటల్ కెమెరాలనే వినియోగించడం మొదలు పెట్టారు. వీటిలో రీల్ కి బదులు స్టోరేజ్ చిప్స్ వస్తాయి. రీల్ వృదా అవుతుంది అనే భయం లేకుండా ఒక్క షాట్‌ని రెండు మూడు యాంగిల్స్‌లో తీసుకుంటూ బెస్ట్ ఔట్ పుట్‌ను తీసుకుంటున్నారు.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అయితే డిజిటల్ కెమెరాలు ఎంత సౌకర్యవంతగా ఉన్నప్పటికీ.. రీల్ లో ఉండే నేచురాలిటీ కనిపించదని భావిస్తారు. అందుకే ఇప్పటికీ హాలీవుడ్ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను రీల్ కెమెరాస్ తో షూట్ చేస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ 'RC16' కోసం కూడా ఇదే పద్దతిని అనుసరిస్తున్నట్లు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు. నేచురాలిటీ కోసం రీల్ కెమెరాస్ ద్వారా షూటింగ్ చేయనున్నారట. RC16 కథ దాదాపు వందేళ్ల క్రితం జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందనుందట. అందుకే కథలో, సన్నివేశాల్లో నేచురాలిటీ కోసం పాత పద్దతిలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
Also Read : బలూచిస్తాన్ లో మారణ హోమం.. 41 మంది మృతి