/rtv/media/media_files/2025/02/02/WIwKNxRdKi7cQ4DxrA2q.jpg)
CM Chandrababu praises on MLA Balakrishna
CM Chandrababu: నటుడు నందమూరి బాలకృష్ణ బావమరిదిగా దొరకడం తన అదృష్టమని ఏసీ సీఎం చంద్రబాబు అన్నారు. 'నిన్నటి వరకూ అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య. ఇదొక అన్‌స్టాపబుల్ ప్రయాణం. దేశం గర్వించదగ్గ బిడ్డ. మా కుటుంబ సభ్యునికి ఈ అవార్డు దక్కడం ఎంతో గర్వంగా ఉంది' అంటూ ఎమోషనల్ అయ్యారు.
Had the honor of spending a memorable evening with the visionary leader, CM Shri @ncbn garu, celebrating the remarkable achievement of our beloved #NandamuriBalakrishna garu on receiving the prestigious #PadmaBhushan, in an event organized by #Bhuvaneshwari garu. pic.twitter.com/MC8BvUYXl4
— Gopichandh Malineni (@megopichand) February 2, 2025
ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నా..
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ నారా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజయర్యారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో తన అనుబంధాన్ని పంచుకున్న చంద్రబాబు.. నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగా బాలయ్య నిబద్ధత కలగిన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇది కూడా చదవండి: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. యువతి కళ్లు పీకేసి, కాలు విరగొట్టి కిరాతకంగా..
‘ఒక వైపు బాలయ్య.. మరోవైపు భువనేశ్వరి ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నా. వీరిద్దరి మధ్య ఉంటే చాలా డేంజర్. నిన్నటి వరకూ అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య. దేశం గర్వించదగ్గ బిడ్డ. మా ఫ్యామిలీలో ఇలాంటి అవార్డు రావడం ఇదే మొదటిసారి. కుటుంబ సభ్యులంతా ఎంతో గర్వపడుతున్నాం. ఇది బిగినింగ్ మాత్రమే. ఇదొక అన్‌స్టాపబుల్ ప్రయాణం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలనుకుంటారు. ఒకే రంగంలో ఉండిపోతారు. కానీ బాలయ్య వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. 1974లో ఆయన సినిమాల్లోకి వచ్చినపుడు 78లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. నాకంటే బాలయ్య నాలుగేళ్లు సీనియర్’ అంటూ తెగ పొగిడేశారు.