/rtv/media/media_files/2025/02/02/ETgJ4hhBHJ09mWRnnSLI.jpg)
AP Eluru Shocking Incident Father Attack on Childrens
AP Crime: ఏపీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నారనే కోపంతో అభంశుభం తెలియని తన ఇద్దరు పిల్లలను చావబాదాడు ఓ సవతి తండ్రి. చార్జర్ వైర్‌తో విచక్షణ రహితంగా కొట్టడంతో కొడుకు పవన్ ఒళ్లంతా వాతలతో నెత్తరు కారిపోయింది. చిన్నారి కూతురును కూడా కొట్టగా తీవ్ర భయాందోళనకు గురై గుక్కపెట్టి ఏడ్చింది. వెంటనే ఈ దారుణాన్ని గమనించిన స్థానికుల వారిద్దని హాస్పత్రికి తరలించి చికిత్సం అందిస్తుండగా ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నిత్యం మద్యం తాగి వచ్చి..
జంగారెడ్డిగూడెంకు చెందిన శశి అనే మహిళకు పదేళ్ల క్రితం తాడేపల్లిగూడెంకు చెందిన గణేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. గణేష్, శశిలకు 9 ఏళ్ల బాలుడు, 5ఏళ్ల కూతురు ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా గణేష్‌తో విడిపోయి పిల్లలతో కలిసి జంగారెడ్డిగూడెంలో ఉంటోంది శశి. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెంలోనే ఓ హోటల్‌లో పనిచేస్తున్న పవన్ అనే వ్యక్తితో శశికి పరిచయం ఏర్పడింది. దీంతో జంగారెడ్డిగూడెంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే అక్రమ సంబంధానికి శశి పిల్లలు అడ్డుగా ఉండటంతో వారిపై కక్ష పెంచుకున్న పవన్.. నిత్యం మద్యం తాగి వచ్చి కొడుకు వరసయ్యే ఉదయ్ పై విచక్షణంగా దాడి చేశాడు.
ఇది కూడా చదవండి: HYD: 2022 నుంచి పరారీలో ఉన్నాడు..హైదరాబాద్ కాల్పుల నిందితుడు పాత దొంగే..
ఇదే క్రమంలో శనివారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికొచ్చి పవన్.. సెల్ ఫోన్ ఛార్జర్ వైర్‌తో కొడుకు బాలుడిపై దాడి చేశాడు. వీపులో పదుల సంఖ్యలో వాతలొచ్చేలా కొట్టాడు. దెబ్బలకు తాళలేక కేకలు వేస్తూ అతను బయటకు పరుగులు పెట్టడంతో స్థానికులు గమనించి హుటాహుటిన బాలుడిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఒంటిపై ఛార్జర్ వైర్ తో కొట్టిన గాయాలు చూసి ఆసుపత్రి వైద్యులు నివ్వెరపోయారు. ఛార్జర్ వైర్ తో కొట్టడమే కాకుండా గాయాలపై కారం పూసాడని ఆ బాలుడు బోరున విలపించాడు. కూతురి కాళ్లపై కూడా కొట్టడంతో ఆమె గాయపడింది. తాను ఎంత చెప్పినా వినకుండా నిత్యం పిల్లలపై ఇదే విధంగా దాడి చేస్తున్నాడని, అడ్డొస్తే తనను కూడా చావబాడుతున్నాడని శశి వాపోయింది. సమాచారం అందడగానే ఆసుపత్రికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.