/rtv/media/media_files/2025/01/17/VMgZT0BXl7jnoD0eL44L.jpg)
star ship rocket
స్పేస్ ఎక్స్...ఎలాన్ మస్క్ (Elon Musk) కు సంబంధించిన ఈ కంపెనీ ఇప్పుడు చాలా ఫేమస్. నాసాతో పాటూ ఇస్రోవంటి అంతరిక్షసంస్థలు స్పేస్ ఎక్స్ రాకెట్లను ఉపయోగించుకుంటున్నాయి. రోజురోజుకూ అంతరిక్ష రంగంలో అబివృద్ధి చెందుతోంది. అలాంటి స్పేస్ ఎక్స్‌కు తాజాగా గట్టిదెబ్బ తగిలింది. ఇది ప్రయోగించిన భారీ రాకెట్ స్టార్ షిప్ ఫెయిల్ అయింది. టెక్సాస్‌లోని బొకా చికా వేదిక నుంచి స్టార్ షిప రాకెట్‌ను స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. అయితే ఇది భూవాతావరణంలోకి ప్రవేశించగానే పెద్ద శబదం చేస్తూ పేలిపోయింది. సాంకేతిక లోపాల కారణంగానే ఇది పేలిందని సమాచారం. అలా పేలిన పేలిన రాకెట్ శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి.
Also Read: Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే ?
Also Read : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి..!
ప్రయోగం పూర్తిగా విఫలమవ్వలేదు..
స్టార్ షిప్ రాకెట్ 232 అడుగులతో మొత్తం 33 రాప్టార్ ఇంజన్లను కలిగిన భారీ రాకెట్. ఇదొక పునర్వినియోగ రాకెట్. రాకెట్ పేలిపోవడంపై స్పేస్ ఎక్స్ (Space X) వెంటనే స్పందించింది. ప్రయోగం పూర్తిగా విఫలం అవ్వలేదని...దానికి సంబంధించిన ముఖ్యమైన సమచారం సేకరించిందని చెప్పుకొచ్చింది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్ షిప్ విశ్వసనీయత పెంచిందని తెలిపింది. అయితే దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.
Spectacular Disintegration of SpaceX's Starship Over Turks and Caicos Islands!🌌🚀🇹🇨pic.twitter.com/JJ7XXbnqkN
— NeuroGizmo (@IaGadgets) January 17, 2025
Also Read: 8th Pay: కేంద్ర ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు