South Korea: సొంత పౌరులపైనే బాంబు దాడి.. వాయుసేన శిక్షణ కార్యక్రమంలో ఘోరం!

దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. వాయుసేన చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకొంది. యుద్ధ విమానాలు పొరబాటున సొంత పౌరులపైనే బాంబులు వేశాయి. నలుగురికి తీవ్రగాయాలవగా ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు.  

New Update
Tejas fighter jet: ఇళ్లపై కూలిన తేజాస్ ఫైటర్ జెట్.. వీడియో వైరల్!

South korea military jet accident

South Korea: దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. వాయుసేన చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకొంది. యుద్ధ విమానాలు పొరబాటున సొంత పౌరులపైనే బాంబులు వేశాయి. నలుగురికి తీవ్రగాయాలవగా ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు.  

బార్డర్ కు 25 కిలోమీటర్ల దూరంలో..

ఈ మేరకు ఉత్తర కొరియా సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. సియోల్‌ ఫైటర్‌ జెట్‌ KF-16 పోచెయోన్‌ స్థావరం నుంచి 8 MK-82 శ్రేణి బాంబులతో బయల్దేరింది. అయితే ఈ బాంబులను బార్డర్ కు 25 కిలోమీటర్ల దూరంలో జారవిడవాలి. అనుకున్నదానికంటే ముందే పొరబాటున ఓ గ్రామంలోని జనావాసాలపై వేయడంతో నలుగురికి తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్పగాయాలైనట్లు దేశ అగ్నిమాపక శాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి:SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!

‘ఈ ఘటన నిజంగా బాధాకరం. బాంబుపేలుళ్ల కారణంగా పౌరులు గాయపడ్డారు. చికిత్స అందిస్తున్నాం. అంతేకాదు అక్కడినుంచి గ్రామస్థులను సురక్షిత ప్రదేశానికి తరలించాం. దీనిపై యాక్సిడెంట్‌ రెస్పాన్స్‌ కమిటీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటోంది. దెబ్బతిన్న ఆస్తులకు నష్టపరిహారం చెల్లిస్తాం'  అని వాయుసేన తెలిపింది. ఇదిలా ఉంటే.. సౌత్ కొరియా సైన్యంలో ప్రమాదాలు కొత్తకాదు. 2022లో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలకు దీటుగా సియోల్‌ హ్యూన్మూ-2 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. అవి  పొరబాటున మార్గం తప్పి సమీపంలోని గోల్ఫ్‌ కోర్టులో పడగా ఆ కోర్టు మొత్తం ధ్వంసమైంది. 

ఇది కూడా చూడండి:హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!

Advertisment
తాజా కథనాలు