/rtv/media/media_files/2025/03/05/VDrS1EmT84Ictwq4KQDz.jpg)
Mahesh Babu went to Odisha state for SSMB29 movie shooting
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఒక మాయాజాలం రాబోతుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు మెల్లి మెల్లిగా పూర్తవుతున్నాయి. జక్కన్న చాలా సీక్రెట్‌గా ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అద్భుతమైన ప్రపంచంలో మహేశ్ బాబును చూపించబోతున్నాడు. దీని కోసం సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అందరి చూపు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది.
Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?
‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని కోసం రాజమౌళి రాత్రింభవళ్లు కష్టపడుతున్నాడు. మరోవైపు మహేశ్ బాబు సైతం జిమ్ వర్కౌట్‌లతో బిజీ బిజీ అవుతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా కొద్ది రోజుల క్రితం పట్టాలెక్కేసింది. ఇప్పటికి కొన్ని సన్నివేశాలను సైతం చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
Also Read : మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఒడిస్సాకి మహేశ్
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో పూర్తయింది. ఈ షూట్‌లో ఆసక్తికర సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా యూనిట్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం రాష్ట్రాలు దాటినట్లు సమాచారం. తాజా షెడ్యూల్ షూట్ కోసం ఒడిస్సాకి బయల్దేరారు. అక్కడ కొన్ని ఉత్కంఠభరితమైన సీన్లు షూట్ చేస్తారని తెలిసింది.
Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
#SSMB29 movie set pic.twitter.com/GmSmhOwQlO
— Deepak SVP 🔥 (@SuperDubbed) March 5, 2025
ఇప్పటి వరకు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూట్ జరిపారు. ఇప్పుడు ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ఈ సినిమా తాజా షెడ్యూల్ ఏర్పాటు చేశారు. దీని కోసమే మహేశ్ బాబు హైదరాబాద్ నుంచి ఒడిస్సా బయల్దేరినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో మహేశ్ బాబు భార్య నమ్రత.. అతడికి సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు కనిపిస్తుంది.
ఇకపోతే ఈ మూవీలో మహేశ్ సరసన.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతుంది. రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్ సిరీస్’ను పోలి ఉండేలా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రేంజ్‌లో వస్తుందో.