Pakistan: మింగ మెతుకు లేదు కానీ గొప్పలకేం తక్కువ లేదు..పాక్ ప్రగల్భాలు

తమ గురించి తాము లేని పోని గొప్పులు చెప్పుకోవడం...రువాత నవ్వులు పాలవ్వడం పాకిస్తాన్ కు కొత్తేమీ కాదు. అయినా సరే అదే బాటలో నడుస్తూ ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ రక్షన మంత్రి మా వార్ జెట్ లకు సూపర్ గిరాకీ అంటూ తెగ నవ్వించేశారు. 

New Update
khawaja

పాకిస్తాన్ కు ఎన్ని సార్లు దెబ్బలు తిన్నా బుద్ధి రాదు. ప్రపంచ దేశాల ముందు నవ్వులు పాలవుతున్నా పట్టించుకోరు అక్కడి నేతలు. మా తీరు మాదే అన్నట్టు ప్రవర్తిస్తారు. ఒకవైపు తినడానికి మింగ మెతుకు లేక అప్పులు చేస్తున్నారు. కానీ గొప్పలతో కడుపు నింపుకోవడం మాత్రం మానరు. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(khawaja asif) చేసిన వ్యాఖ్యలపై మళ్ళీ చర్చ జరుగుతోంది. 

Also Read :  వెనిజులా చమురు నిల్వలు అమెరికా చేతికి.. ట్రంప్ కీలక ప్రకటన

అవునా..నిజమా..

పాకిస్తాన్ రక్షణ శాఖ బలంగానే ఉంటుంది. కానీ ఆ దేశానికి యుద్ధ విమానాలు తయారు చేసేంత సీన్ అయితే లేదు. వాళ్ళే ఎప్పుడూ చైనా , అమెరికా, అరబ్ కంట్రీస్ దగ్గర నుంచి యుద్దధ విమానాలను కొనుక్కుంటూ ఉంటారు. అయితే తాజాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు మధ్య దీనికి సంబంధించిన చర్చలు ఏవో జరుగుతున్నాయి. అదొక్కటి చాలు మాకు చెలరేగిపోవడానికి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు అక్కడి నేతలు. భారత్‌తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని, అవి హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయన్నారు. ఇకపై తమ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు ఐఎంఎఫ్ రుణం కూడా అవసరం ఉండకపోవచ్చంటూ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రగల్భాలు పలికారు. గతేడాది భారత్ తో యుద్ధం తరువాత పాకిస్తాన్ కు రక్షణ ఆర్డర్లు పెరిగాయి. అవి ఎంతలా ఉన్నాయి అంటే..ఆరు నెలల తర్వాత మాకు ఐఎమ్ఎఫ్ నుంచి అప్పు తీసుకునే అవసరం పడకపోవచ్చు అంటూ గొప్పులు చెప్పుకున్నారు. పాక్ మిలిటరీ సామర్థ్యాలు ప్రపంచం దృష్టిలో పడ్డాయి అంటూ ఖవాజా వ్యాఖ్యలు చేశారు. 

అసలు రక్షణ మంత్రా ఖవాజా చెప్పిన పరిస్థితి పాకిస్తాన్ లో లేదు. రీసెంట్ గా కూడా ఆ దేశం అప్పు కోసం ఐఎమ్ఎఫ్  దగ్గరకు వెళ్ళింది. అంతేకాకుండా వాళ్ళు తమ అంతర్జాతీయ విమానయాన సంస్థను కూడా అమ్మేందుకు సిద్ధమయ్యారు. 2026-2027 బడ్జెట్‌లో కొన్ని సడలింపులు, సబ్సిడీలు ఇవ్వాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం రుణషరతులపై మినహాయింపులు ఇవ్వాలని ఐఎంఎఫ్‌ను కోరుతోందని స్థానిక మీడియా కూడా చెబుతోంది.  అయితే మరి ఖవాజా ఎందుకు అలా మాట్లాడరు అంటే..వారి దగ్గర ఉన్న జేఎఫ్-17, జే-10కు రెండు చిన్న దేశాలు అయిన అజైర్ బైజాన్, లిబియాలు కొనుక్కుంటున్నారు. బంగ్లాదేశ్ చర్చలు జరుపుతోంది అంతే. దీన్ని చూసుకునే ఖవాజా మేము తోపు అంటూ మాటలు మాట్లాడుతున్నారు. 

యుద్ధ విమానాలు..

పాకిస్తాన్(pakistan) కు అసలు యుద్ధ విమానాలు సొంతంగా చేసుకునే సాంకేతికత లేదు. వారు కేవలం కొన్ని పరికరాలను మాత్రమే తయారు చేయగలదు. జేఎఫ్‌-17 యుద్ధ విమానాలకు రష్యా, చైనా, ఇటలీ, తుర్కియే, యూకేకు చెందిన పరికరాలను పాకిస్తాన్ అమర్చుతోంది. వీటిల్లో ఇంజిన్ రష్యాది అయితే...మొత్తం డిజైన్, తయారీ అంతా చైనా చేస్తోంది. పాక్ దగ్గర ఏవో కొన్ని పరికరాలు మాత్రమే వాడుతున్నారు. పాక్ చెప్పినట్టు యుద్ధ విమానాలను అమ్ముతున్నారనే అనుకున్నా..అందులో వచ్చే ఆదాయంలో తమ వాటాను ఇతర దేశాలు తీసుకోగా.. షరీఫ్ ప్రభుత్వానికి వచ్చేది అంతంతమాత్రంగానే ఉంటుందని అక్కడి ఆర్థిక విశ్లేషకులే చెబుతున్నారు. ఒకవేళ జేఎఫ్‌-17ను 15 మిలియన్‌ డాలర్లు, జే-10ను 40 మిలియన్ డాలర్లకు విక్రయించినా..పాకిస్తాన్ కు ఉన్న 300 బిలియన్ డాలర్ల అప్పుల్లో ఏ పాటో వారే చెప్పాలి. 

Also Read: Crash: కుప్ప కూలిన స్టాక్ మార్కెట్..8 లక్షల కోట్లు హుష్ కాకి

Advertisment
తాజా కథనాలు