/rtv/media/media_files/2026/01/07/trump-2026-01-07-10-43-11.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆ దేశ చమురు సంపదపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులాలోని అతిపెద్ద చమురు నిల్వ(Venezuela’s Oil Reserves)లను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోబోతోందని, దీంతో అమెరికా 'భారీగా డబ్బు సంపాదించబోతోందని' ఆయన స్పష్టం చేశారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం మెరుపు దాడిలో బంధించి న్యూయార్క్‌కు తరలించిన మరుసటి రోజే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. వెనిజులాలోని తాత్కాలిక యంత్రాంగం సుమారు 30 నుండి 50 మిలియన్ బ్యారెళ్ల నాణ్యమైన ముడి చమురు(oil-reserves) ను అమెరికాకు అప్పగించనుందని ఆయన వెల్లడించారు. ఈ చమురు విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 2.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 23,000 కోట్లు) ఉంటుందని అంచనా.
Also Read : మింగ మెతుకు లేదు కానీ గొప్పలకేం తక్కువ లేదు.. పాక్ ప్రగల్భాలు
ఆదాయంపై ట్రంప్ నియంత్రణ
ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేస్తూ, ఈ చమురు విక్రయాల ద్వారా వచ్చే నిధులను అమెరికా అధ్యక్షుడిగా తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. "ఈ ఆదాయం వెనిజులా, అమెరికా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించబడుతుంది. వెనిజులా(u.s. venezuela war 2025) లో దశాబ్దాలుగా పాడైపోయిన చమురు మౌలిక సదుపాయాలను బాగు చేయడానికి అమెరికా చమురు దిగ్గజాలు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడతాయి" అని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ చర్యలను పలువురు అంతర్జాతీయ నిపుణులు 'ఆధునిక సామ్రాజ్యవాదం'గా అభివర్ణిస్తున్నారు. కేవలం చమురు సంపదను దోచుకోవడానికే మదురోను గద్దె దించారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 1.5% మేర తగ్గాయి. ఇది అమెరికాలో ఇంధన ధరలను తగ్గించడానికి సహాయపడుతుందని ట్రంప్ భావిస్తున్నారు. వెనిజులాలో దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. వెనిజులా విధానాలను ఇకపై అమెరికానే నడిపిస్తుందని ట్రంప్ ప్రకటించారు. వెనిజులాపై ఆంక్షలు తొలగి అమెరికా నియంత్రణలోకి వస్తే, భారత్‌కు రావాల్సిన పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : అట్లాంటిక్ లో రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. ఛేజ్ చేసి పట్టుకున్న అమెరికా దళాలు
Follow Us