/rtv/media/media_files/2025/05/17/m6mzW8sQTC2C2mEmraMr.jpg)
Edi Rama
Edi Rama : అల్బేనియా రాజధాని టిరానాలో జరుగుతున్న ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సులో ఆ దేశాధినేత ఇటలీ ప్రధానికి పలికిన స్వాగతం అందరినీ ఆకట్టుకుంది. ఒక దేశాధినేత అనే విషయాన్ని పక్కన పెట్టి ఆయన స్వాగతం పలికిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం...
Giorgia Meloni truly commands the utmost respect of world leaders. This is quite the sight to see. pic.twitter.com/xBp3d0Qi7j
— Joey Mannarino 🇺🇸 (@JoeyMannarinoUS) May 16, 2025
Also Read: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిసైల్ ఇదే..! ధర ఎంతంటే?
అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు యూరోపియన్ యూనియన్‌కు అన్ని దేశాల అధినేతలు హాజరయ్యారు. వారికి అల్బేనియా దేశాధినేత ఎడీ రమా దగ్గరుండి మరీ ఘన స్వాగతం పలికారు. ఇదే సందర్భంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి కూడా స్వాగతం చెప్పారు. కానీ ఆయన అందరిలా సాధారణంగా స్వాగతం పలకలేదు. ఇప్పుడదే వైరల్ గా మారింది. సదస్సుకు హాజరైన జార్జియా మెలోనీ.. కారు దిగి రెడ్ కార్పెట్‌పై నడుస్తూ వస్తుండగా.. ఎదురుగా అల్బేనియా దేశాధినేత ఎడీ రమా ఆమెకు స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చాడు.
Also Read : ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్
అదే క్రమంలో ఓ వైపు వర్షం పడుతోంది. అయినా ఎడీ రమా ఎంతో ఓపిగ్గా అందరికీ దగ్గరుండి మరీ స్వాగతం పలికారు. అలాగే మెలోనీ దగ్గరకు రాగానే చేతిలో ఉన్న గొడుకును పక్కన పెట్టి రెడ్ కార్పెట్ పై మోకాళ్లపై కూర్చుని, రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ స్వాగతం పలికారు. ఎడీ రమా ఆహ్వానానికి ఇటలీ ప్రధానిఖుషీ అయిపోయారు. ఆయన దగ్గరకు చేరుకున్న ఆమె వెంటనే ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అనంతరం యూరప్ నాయకులకు ఆతిథ్యం కూడా ఇచ్చారు.
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
అయితే అల్బేనియా దేశాధినేత ఎడీ రమా ఇలా వినూత్నంగా ఆహ్వానించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో మెలోనీ పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరూ ఓ సదస్సులో కలుసు కున్నారు. ఆ సందర్భంగా అల్బేనియా దేశాధినేత ఎడీ .. మోకాళ్లపై కూర్చుని స్వాగతం పలకడమే కాకుండా ఆమెకు స్కార్ఫ్‌ను కానుకగా కూడా ఇచ్చారు. జార్జియా మెలోనీని తన ‘ఇటాలియన్ సిస్టర్’.. అని ఎడీ రమా పలు సందర్భాల్లో గుర్తు చేశారు. మా ఇంటి ఆడపడుచుకు ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా అని అనడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.
Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
ఈ సందర్భంగా ఎడీ రమా మీడియాతో మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్ దేశాధినేతలందరికంటే తను ఎత్తైనవాడినని కానీ అతి చిన్న దేశానికి నాయకత్వం వహిస్తున్నానని చమత్కరించారు. అంతేకాక ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించే అవకాశం తమ దేశానికి దక్కడం పెద్ద గౌరవంగా భావిస్తున్ననన్నారు.