Russia-Ukraine Row: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేదిలేదు: రష్యా

రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిగ్గా ఆపేదిలేదన్నారు. ఇప్పట్లో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య సంధికి మార్గాలు కనిపించడం లేదన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Russia President Putin

Putin


రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిగ్గా ఆపేదిలేదన్నారు. రష్యాతో పాటు తన పొరుగు దేశాల్లో సుదీర్ఘ శాంతి నెలకొనేలా చేసేందుకు చట్టబద్ధమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఇప్పట్లో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య సంధికి మార్గాలు కనిపించడం లేదన్నారు. ఒకవేళ బలహీన ఒప్పందం జరిగితే.. పశ్చిమ దేశాలు మళ్లీ ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసి యుద్ధ తీవ్రతను మరింత పెంచుతాయని పేర్కొన్నారు.   

Also Read: కాంగ్రెస్‌ను ఇండియా కూటమి నుంచి తొలగించాలి.. ఆప్‌ షాకింగ్ కామెంట్స్

'' రష్యా భద్రతకు హామీ ఇచ్చే షరతులతో చట్టపరమైన ఒప్పందం మాకు కావాలి. దీన్ని ఎవరూ ఉల్లంఘించలేని విధంగా తయారుచేయాలి. అలాగే మా పోరుగు దేశాల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని'' సెర్గీ లావ్రోవ్ అన్నారు. అంతేకాదు ఇటీవల సిరాయాపై రెబల్స్‌ చేసిన తిరుగుబాటుపై కూడా సెర్గీ స్పందించారు. సిరియా కొత్త పాలకులతో రష్యా దీర్ఘకాలం వ్యూహాత్మక సంబంధాలు కోరుకుంటుందని చెప్పారు. 

Also Read: సంభాల్‌లో మరో అద్భుతం.. తాజాగా బయటపడ్డ మృత్యుబావి

మరోవైపు క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉస్కోవ్‌ కూడా దీనిపై మాట్లాడారు. ఇప్పటికే తాము సిరియా పాలకులతో సైనిక, దౌత్య స్థాయిలో సంప్రదింపులు చేపట్టామని తెలిపారు. అధ్యక్షుడు పుతిన్ సైతం ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంపత్‌ కూడా చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఇదే సమయంలో తమ భూభాగాలను వదులుకునేందుకు, ఉక్రెయిన్‌ నాటో చేరేందుకు తాము ఒప్పుకోమని కూడా రష్యా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  

Also Read: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం

Also Read: ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు.. ఈ ఏడాదిలో పొలిటికల్ హైలెట్స్ ఇవే!

Advertisment
తాజా కథనాలు