Sambhal: సంభాల్‌లో మరో అద్భుతం.. తాజాగా బయటపడ్డ మృత్యుబావి

యూపీలోని చందౌసి జిల్లాలో ఇటీవల మెట్లబావి బయటపడగా గురువారం మరో అద్భుతం వెలుగుచూసింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలోనే ఒక బావి కనిపించింది. స్థానికులు దీన్ని మృత్యుబావిగా పిలుస్తున్నారు.ఈ బావికి సమీపంలోనే మృత్యుంజయ మహాదేవ్ ఆలయమని ఉందని చెబుతున్నారు.

New Update
Mrityu Koop

Mrityu Koop

ఉత్తరప్రదేశ్‌లోని చందౌసి జిల్లాలో తవ్వకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెట్లబావి బయటపడగా.. గురువారం మరో అద్భుతం వెలుగుచూసింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలోనే ఒక బావి కనిపించింది. హిందువులు ఎక్కువగా ఉంటున్న ప్రాంతంలోనే ఈ బావి బయటపడింది. అయితే దీన్ని మృత్యుబావిగా పిలుస్తున్నారు. ఈ బావికి సమీపంలోనే ఒక ఆలయం ఉందని.. అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయమని స్థానికులు చెబుతున్నారు.

Also Read: చెన్నై నడిబొడ్డున ఘోరం.. అన్నా యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్‌రే*ప్!

అక్కడ కూాడా తవ్వకాలు జరపాలి

అయితే ఆ ఆలయం మట్టిలో కూరుకుపోయిందని.. ఇక్కడ తవ్వకాలు కూడా జరిపితే కచ్చితంగా ఆలయం కనిపిస్తుందని అంటున్నారు. పురణాల ప్రకారం చూసుకుంటే సంభాల్ ఒకప్పుడు పుణ్యక్షేత్రంగా ఉండేది. ఇక్కడ 84 ప్రదక్షిణల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లోనే 68 పుణ్యక్షేత్రాలు ఉన్నాయని సమాచారం. అలాగే అక్కడ 19 బావులు ఉన్నాయని.. వాటిలో ప్రతిదానికి ఓ ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాల్లో కూడా కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు.            

ఇటీవల సంభాల్‌లో మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానిక పరిపాలన అధికారులు ఇక్కడ తవ్వకాలు ప్రారంభించగా.. చారిత్రక కట్టడాలు బయటపడుతున్నాయి. ఇటీవల కనిపించిన పురాతన మెట్లబావిని శుభ్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకా ఎన్నిరోజులు పడుతుందో చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా మృత్యుబావి కూడా బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్‌ స్వాప్‌ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!

ప్రస్తుతం జిల్లా యంత్రాంగం మట్టిలో కూరుకుపోయిన కట్టడాలను పరిశోధించే పనిలో పడింది. ప్రస్తుతం మృత్యుబావిని పూర్తిగా వెలికితీసే పనులు జరుగుతున్నాయి. ఇలాగే చందౌసిలో పలు పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా జరుగుతన్నాయి. ఇదిలాఉండగా.. మరోవైపు యోగీ సర్కార్ సంభల్‌ తీర్థయాత్ర స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేస్తోంది. దీనికి సంబంధించిన పనులను కూడా ముమ్మరం చేసింది.ఇక్కడి జిల్లా యంత్రాగం ఈ ప్రాంతంలో ఒక పురాతన శివాలయాన్ని గుర్తించింది. దీన్ని 1978లో మూసివేసినట్లు పేర్కొంది. అయితే ఇటీవల జరిపిన తవ్వకాల్లో మెట్లబావి కూడా బయటపడటంతో.. యోగీ ప్రభుత్వం శివాలయాన్ని మళ్లీ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు