Vladimir Putin: భారత్‌కు పుతిన్‌.. షెడ్యూల్ ఖరారు

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్నిరోజుల్లో భారత్‌కు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది.

New Update
Russian President Vladimir Putin To Visit India On December 4-5

Russian President Vladimir Putin To Visit India On December 4-5

రష్యా(russia) అధ్యక్షుడు పుతిన్ మరికొన్నిరోజుల్లో భారత్‌కు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది.  రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు పుతిన్ అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో పుతిన్‌కు భారత్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also Read: మావోయిస్టుల సంచలన ప్రకటన..జనవరి 1న సామూహికంగా లొంగిపోతాం

Putin To Visit India On December 4-5

పుతిన్‌ త్వరలో భారత్‌కు రాబోతున్నారని ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. మొత్తానికి షెడ్యూల్ ఖరారైపోయింది. ఆయన మన దేశంలో రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే రష్యా ఆర్థిక వ్యవస్థ విషయంలో చూసుకుంటే అక్కడ భవన నిర్మాణం, జౌళి, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత ఉంది. ఈ నేపథ్యంలోనే 70 వేల మందికి పైగా భారతీయ కార్మికులకు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read: ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు? కొడుకు అడిగినా, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం సైలెంట్ గా ఎందుకుంది?

ఇదిలాఉండగా 2021 తర్వాత పుతిన్‌ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. 2024లో ప్రధాని మోదీ(PM Modi), పుతిన్(vladimir-putin) రెండుసార్లు సమావేశమయ్యారు. 2024 జులైలో ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో మోదీ.. రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్' అందుకున్నారు. గతేడాది అక్టోబర్‌లోనే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో రష్యాలో కజాన్‌లో వీళ్లిద్దరూ మళ్లీ భేటీ అయ్యారు. ఇటీవల చైనాలో షాంఘై సహకార సంస్థ సదస్సు జరగగా.. అక్కడ మోదీ, పుతిన్ భేటీ అయ్యి పలు విషయాలపై చర్చలు జరిపారు. 

Advertisment
తాజా కథనాలు