Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు? కొడుకు అడిగినా, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం సైలెంట్ గా ఎందుకుంది?

పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు? ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ప్రశ్న ఇది. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లు, కొడుకు ఎవరు అడిగినా ఆయనను చూపించడం లేదు. కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. పాకిస్తాన్ ఏం దాస్తోంది?

New Update
imran khann

పాకిస్తాన్(pakistan) ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ రెండు రోజుల నుంచి ప్రపంచం అంతా కోడై కూస్తోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన గురించి ఆందోళనలను జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు వారాలుగా ఆయనను తమకు చూపించలేదని..తన తండ్రిని డెత్ సెల్ లో ఉంచారని అన్నారు. ఆయన చనిపోయారంటూ వార్తలు రావడంతో తమకూ అనుమానంగా ఉందని భయాన్ని వ్యక్తం చేశారు. ఆయన బతికున్నట్లుగా తమకు ఆధారాలు చూపించాలని ఖాసీం ఖాన్ జైలు అధికారులను, పాక్ ప్రభుత్వాన్ని కోరారు.

ప్రపంచ దేశాలకూ బహిరంగ విజ్ఞప్తి చేశారు. గత 845 రోజులుగా తన తండ్రి ఇమ్రాన్ ఖాన్(imran-khan)జైల్లోనే ఉన్నారని ఖాసీం ఖాన్ వివరించారు. అయితే గత నెల రోజుల నుంచి తనను, తన కుటుంబ సభ్యులను ఆయన్ను చూసేందుకు గానీ, మాట్లాడేందుకు గానీ అనుమతించడం లేదని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయనను తాము కలవవచ్చునని..కానీ జైలు అధికారులు మాత్రం దానికి ఒప్పుకోవడం లేదని ఖాసిం చెబుతున్నారు. కనీసం ఫోన్ కాల్స్ కూడా చెయ్యనివ్వడం లేదు. తమకు ఏ సమాచారం ఇవ్వకుండా పూర్తిగా అడ్డుకున్నారని ఖాసిం ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read :  ఘోర అగ్నిప్రమాదం.. 128 మంది మృతి

ఇమ్రాన్ ను ఎందుకు  పాక్ ప్రభుత్వం దాస్తోంది?  

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ గురించి తెలపాలని పాకిస్తాన్ అంతా నిరసనలు చుట్టుముట్టాయి. ఆయన సోదరీమణులు జైలు దగ్గరే ఆందోళన చేపట్టారు. వారిపై జైలు అధికారులు, పోలీసులు అమానుషంగా దాడి చేశారు. చీకట్లో జుట్టు పట్టుకుని లాగి, కొట్టారని చెప్పారు. ఇక పీటీఐ మద్దుతుదారులు, ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్ అయితే దేశంలో గొడవలు సృష్టిస్తున్నారు. కానీ ఎవరేం చేసిన పాక్ గవన్రమెంట్ మాత్రం నిమ్మకునీరెత్తినట్టుంది. ఏదో మొక్కుబడిగా ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటే ఒక ప్రకటనను విడుదల చేసి ఊరుకుంది. కానీ ఒక్కసారి కూడా ఇమ్రాన్ ఖాన్ ను చూపిచాలని అనుకోలేదు. కనీసం ఆయన వీడియో, మాట్లాడిన మాటలు లాంటివి కూడా బయటపెట్టడం లేదు. దీంతో ఆయన నిజంగానే చనిపోయారని నమ్మకం గట్టిపడుతోంది. తండ్రి క్షేమం, ఈ అమానవీయ నిర్బంధం పరిణామాలకు పూర్తి చట్టపరమైన, నైతిక అంతర్జాతీయ బాధ్యతను పాకిస్థాన్ ప్రభుత్వం, అధికారులు భరించాల్సి ఉంటుందని కుమారుడు ఖాసీం ఖాన్ హెచ్చరించారు. ఇక బలూచిస్థాన్ విదేశాంగ శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా.. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్మునీర్, నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ను చంపేశారని ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 

Also Read :  77 ఏళ్ళల్లో అతి పెద్ద అగ్ని ప్రమాదం..కృత్రిమ వానకూ ఆరని మంటలు

Advertisment
తాజా కథనాలు