/rtv/media/media_files/2025/06/03/HoX43SNVp6KgpXTAql0o.jpg)
Russia claims it killed 1,400 Ukrainian soldiers in 24 hours
రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతూనే ఉన్నాయి. తాజాగా కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. గత 24 గంటల్లో తామ చేసిన దాడుల్లో 1430 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కీవ్‌లో డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది. మరోవైపు.. మూడేళ్ల నుంచి ఇరుదేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో తమ సైన్యం పది లక్షల మంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ కార్యాలయం తెలిపింది.
Also Read: ఇకనుంచి ఒకటవ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణ !
యుద్ధంలో మొత్తం 9,90,800 మంది రష్యన్ సైనికులు మృతి చెందారని.. అయితే గత 24 గంటల్లో 1100 మంది సైనికులు గత 24 గంటల్లోనే మరణించినట్లు పేర్కొంది. తాము చేసిన దాడుల్లో రష్యాకు చెందిన 10,881 ట్యాంకులు, 22,671 సాయుధ పోరాట వాహనాలు, 50,607 ఇంధన ట్యాంకులు, 41 యుద్ధ విమానాలు, 336 హెలికాప్టర్లు, 38,748 డ్రోన్లు, 28 నౌకలు, అలాగే ఒక సబ్‌మెరైన్ కోల్పోయినట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ వెల్లడించారు.
Also Read: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!
ఇదిలాఉండగా సోమవారం టర్కీలోని ఇస్తాంబుల్‌లో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల చర్చలు జరిగాయి. టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ అధ్యక్షతన ఈ చర్చ జరిగింది. కాల్పుల విరమణ షరతులపై చర్చలు జరిపినప్పటికి అవి ఫలించినట్లు ఎవరూ ప్రకటించలేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ చర్చలకు ముందు ఉక్రెయిన్ రష్యాపై భారీ డ్రోన్ దాడి చేసింది. ఆ తర్వాత రష్యా కూడా ఉక్రెయిన్‌పై డ్రోన్ దాడితో విరుచుకుపడింది.
Also Read: కడియం కాళ్లు మొక్కిన దక్కని ఇందిరమ్మ ఇల్లు
Also Read: పాకిస్థాన్ టిక్ టాక్ స్టార్ దారుణ హత్య..
telugu-news | rtv-news | national-news | ukraine | russia | russia-ukraine-war
Follow Us