Pakistan: పాకిస్థాన్ టిక్ టాక్ స్టార్‌ దారుణ హత్య..

పాకిస్థాన్‌లోని 17 ఏళ్ల టిక్‌టాక్‌ స్టార్ సనా యూసఫ్‌ హత్యకు గురయ్యారు. ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో ఓ దుండగుడు కాల్చి చంపినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఇటీవల భారత్‌-పాక్‌ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె వీడియోలు వైరలయ్యాయి.

New Update
Pakistani TikTok star Sana Yousaf, 17, shot dead in Islamabad, Report

Pakistani TikTok star Sana Yousaf, 17, shot dead in Islamabad, Report

పాకిస్థాన్‌లోని 17 ఏళ్ల టిక్‌టాక్‌ స్టార్ సనా యూసఫ్‌ హత్యకు గురయ్యారు. ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో ఓ దుండగుడు కాల్చి చంపినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమా యూసఫ్ చేసిన రీల్స్‌ వైరలయ్యాయి. పాకిస్థాన్‌కు నీళ్లు ఇవ్వడాన్ని ఆపేస్తే ఎలా బతాకలని, పాక్‌లో కూడా మంచి వాళ్లు ఉంటారని ఆమె చేసిన వీడియోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తాజాగా ఆమె హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. 

Also Read: ఇకనుంచి ఒకటవ తరగతి నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ

ఇక వివరాల్లోకి వెళ్తే.. సనా యూసఫ్‌ ఇస్లామాబాద్‌లో ఉంటోంది. సోమవారం ఆమె ఇంట్లోకి ఓ గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. ఆమెపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తా సంస్థ తెలిపింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. రంగలోకి దిగిన పోలీసులు హంతకుడి కోసం గాలిస్తున్నారు.  

ఇదిలాఉండగా పాక్‌లోని ఖైబర్‌ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్‌కు చెందిన సనా యూసఫ్‌కు టిక్‌టాక్‌లో చాలామంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె హత్యకు గురైందన్న వార్తలు వైరల్ కావడంతో తన ఫాలోవర్స్‌ దిగ్భ్రాంతి చెందుతున్నారు. సనా హత్యకు కారణమైన వాళ్లని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.  

Also Read: ఇండియాకు చైనా వార్నింగ్.. ‘పాక్ లాగే మీకూ నీళ్లు ఉండవు’

 

 telugu-news | pakistan | tik-tok | rtv-news | murder

Advertisment
Advertisment
తాజా కథనాలు