Retaliatory tariffs on America: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!

భారత్‌ ఎగుమతులపై 25 నుంచి 50% సుంకాలు US పెంచింది. బదులుగా భారత్‌కు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా డబ్ల్యూటీఓకు నోటీసులు పంపింది. అమెరికా నోటీసులను తిరస్కరించింది. ట్రంప్ పాక్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.

New Update

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌కు మోదీ బిగ్‌షాక్ ఇచ్చారు. ఇటీవల భారత్ ఎగుమతులపై భారీగా సుంకాలు పెంచనున్నట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందేే. దానికి బదులుగా భారత్‌కు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా డబ్ల్యూటీఓకు నోటీసులు పంపింది. అమెరికా నోటీసులను తిరస్కరించింది.  

అమెరికా సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు డబ్ల్యూటీఓకు భారత్ తెలిపింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత కఠినంగా మారనున్నాయి. అమెరికాకు ఎగుమతి చేసిన ఉక్కు, అల్యూమినియంలపై మొదట 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జూన్ 4 నుంచి దాన్ని 50 శాతానికి పెంచనున్నట్లు చెప్పాడు. దీంతో భారత్ ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే భారత్ WTOను  ఆశ్రయించింది. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత సమయంలో ట్రంప్ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.  పాకిస్తాన్‌కు ఆయుధాలు, రుణాలు ఇప్పించడంలో అమెరికా పాత్ర పోషించింది. 

america | 47th us president donald trump | trump | america president trump | india | pm modi | tarriffs | latest-telugu-news | usa

Advertisment
తాజా కథనాలు