Kadiyam Srihari : కడియం కాళ్లు మొక్కిన దక్కని ఇందిరమ్మ ఇల్లు

తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలంటూ ఎల్లమ్మ అనే మహిళ స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేకడియం శ్రీహరికాళ్లపై పడిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనగామలో కడియం పలువురికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హత పత్రాలను అందజేశారు.

New Update
Kadiyam Srihari

Kadiyam Srihari : తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు ఇళ్లు కేటాయించకుండా అర్హుల జాబితా నుంచి తొలగించారని, తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలంటూ ఎల్లమ్మ అనే మహిళ స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేకడియం శ్రీహరికాళ్లపై పడిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనగామలో కడియం శ్రీహరి పలువురికి ఇందిరమ్మ ఇల్లు కు సంబంధించిన అర్హత పత్రాలను అందజేశారు.

ఇది కూడా చదవండి: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్‌ను పాడు చేస్తుందా?

 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లిలో మండలంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్‌ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాగా మండల ఆర్డీవో డీఎస్‌ వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. కొత్తపల్లికి చెందిన గుగ్గిళ్ల ఎల్లమ్మకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేరు రాగా, పాత ఇల్లు కూల్చి ముగ్గు పోసుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంది.

ఇది కూడా చదవండి:ఈ పీరియడ్స్ సంకేతాలను విస్మరించవద్దు.. తీవ్రమైన సమస్యలు తప్పవు!

 అయితే ఇంటి అనుమతి కోసం ప్రొసీడింగ్స్‌ ఇచ్చే సమయానికి ఆమె పేరు లిస్టలో లేదు. ఈ విషయమై ఆమె శ్రీహరితో మాట్లాడింది. అంతేకాక తమ పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారని, తమకు ఇల్లు ఇప్పించి ఆదుకోవాలంటూ కన్నీరు పెట్టుకుంది. అయినా ఆయన పట్టించుకోకపోవడంతో స్టేజీపై కడియం కాళ్లపై పడింది. మరొక వైపు ఇండ్లు, భూములు లేని నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలంటూ సమావేశం మధ్యలో పుంజూ రి రజిత, నాగరాజు దంపతులు ప్లెక్సీ పట్టుకు ని నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇల్లు కేటాయించకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని, నాయకుల చుట్టూ ఎన్నిమార్లు తిరిగినా ఇళ్ల జాబితాలో పేరు రాలేదని కడియం శ్రీహరికి చేతులెత్తి మొక్కారు. దీంతో పోలీసులు వారందరినీ బలవంతంగా అక్కడ నుంచి తీసుకపోయే ప్రయత్నంచేశారు. అధికారులు విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేశారని, రెండో విడతలో మళ్లీ వస్తాయని కడియం నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

Advertisment
తాజా కథనాలు