/rtv/media/media_files/2025/07/04/air-india-crash-2025-07-04-11-51-17.jpg)
Air India Crash victims' families claim forced financial disclosures
ఇటీవల గుజరాజ్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే బాధిత కుటుంబాలకు ఎయిరిండియా సంస్థ తాత్కాలిక పరిహారం అందిస్తోంది. కానీ ఈ పరిహారం ఇవ్వాలంటే ముందుగా కుటుంబ ఆర్థిక వివరాలు చెప్పాలని తమను బలవంతపెడుతున్నట్లు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎయిర్‌ఇండియా కూడా స్పందించింది.
Also Read: నడి రోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త
ఇక వివరాల్లోకి వెళ్తే.. విమాన ప్రమాదంలో బాధిత కుటంబాలకు పరిహారం అందాలంటే వారు కొన్ని ఆర్థిక వివరాలు చెప్పాలని ఎయిరిండియా ఒత్తిడి చేస్తోందని బ్రిటన్‌కు చెందిన న్యాయసంస్థ స్టీవర్ట్స్ ఆరోపణలు చేసింది. ఆ కంపెనీ 40 బాధిత కుటుంబాల తరఫున పరిహార చెల్లింపు ప్రక్రియపై పనిచేస్తోంది. తమ క్లయింట్లకు ఎయిరిండియా ఓ ప్రశ్నాపత్రాన్ని పంపించిందని తెలిపింది. అందులో వ్యక్తిగత వివరాలతో పాటు ఆర్థిక సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నట్లు పేర్కొంది. అంతేకాదు విమాన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిపై బాధిత కుటుంబం ఆర్థికంగా ఆధారపడి ఉందా ? లేదా ? అని అడిగిందని తెలిపింది. కుటుంబ ఆర్థిక వివరాలు ఇవ్వకపోతే బాధిత కుటుంబాలకు పరిహారం రాదనే ప్రస్తావన కూడా ఉందని ఆ సంస్థ తెలిపింది.
Also Read: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుడుతున్న చిన్నారులు
దీనిపై జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ఎయిరిండియా స్పందించింది. ఇవంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేసింది. మృతులతో దరఖాస్తుదారులకు ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకునేందుకే ఈ ప్రశ్నాపత్రాన్ని పంపించినట్లు పేర్కొంది. ఇలా చేస్తేనే తాత్కాలిక చెల్లింపులు సిరిగ్గా చేయగలమని తెలిపింది. ఇలాంటి అంశాల్లో కొన్ని విధివిధానాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పింది. బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉండాలని మేము కోరుకుంటున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది.