/rtv/media/media_files/2025/07/19/amit-shah-2025-07-19-15-02-39.jpg)
Amit Shah
కేంద్రం హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2036లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడలు భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆ సమయానికి భారత్ ఒలింపిక్ పతకాల లిస్ట్‌లో టాప్-5లో ఉండటమే లక్ష్యమని తెలిపారు. ప్రపంచ పోలీస్ ఫైర్ క్రీడల్లో పతాకలు సాధించిన భారత బృంద సభ్యులను ఆయన ఘనంగా సత్కరించారు.
Also read: ఇండియా-పాక్ యుద్ధంపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. 5 ఫైటర్ జెట్లు బ్లాస్ట్
2036 Olympics
ఈ సందర్భంగా పతక విజేతలకు నజరానా కూడా అందించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. 2036 ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్య హక్కులు సాధించేందుకు ప్రాథమిక బిడ్డింగ్‌లో పాల్గొన్నాం. ఒలింపిక్స్‌ను నిర్వహించే సత్తా మన దేశానికి ఉందని తెలిపారు. అలాగే ఈ పోటీల కోసం ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఒలింపిక్స్‌లో పతకాలు గెలవగలిగే 3 వేల మంది ప్రతిభావంతుల్ని గుర్తిస్తామని తెలిపారు. వాళ్లను నెలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఆ క్రీడాకారులను ఒలింపిక్స్ క్రీడలకు ధీటుగా తయారు చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: విషం కలిపిన నీళ్లు తాగి నలుగురు జవాన్లు మృతి
ఇదిలాఉండగా 2024లో పారిస్‌లో సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక 2026లో వింటర్ ఒలింపిక్స్ ఇటలీలో జరగనున్నాయి. 2028లో సమ్మర్ ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగనున్నాయి. ఆ తర్వాత 2032లో ఫ్రాన్స్‌లో వింటర్ ఒలింపిక్స్, 2032లో ఆస్ట్రేలియాలో సమ్మర్ ఒలింపిక్స్, 2034లో వింటర్ ఒలింపిక్స్ అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో జరగనున్నాయి. అయితే 2036లో జరగబోయే సమ్మర్ ఒలింపిక్స్‌కు బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ ఏడాదిలో జరగబోయే ఒలింపిక్స్‌ను భారత్ దక్కించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
Also Read : మోకాలి నొప్పితో ఇబ్బందిగా ఉందా..? ఉపశమనం పొందడానికి ఈ నివారణ ట్రై చేయండి
Also Read : ఆదిలాబాద్‌లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్.. భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం
telugu-news | rtv-news | olympics | national-news | amit shah