పాక్‌కు ఎగుమతులు ఆపేసిన భారత్.. భారీగా తగ్గనున్న వస్తువులు

పహల్గామ్ దాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత ఎగుమతులను కూడా ఆపేసింది. దీంతో ఇండియాలో బాస్మతీ రైస్, మందుల ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. అలాగే పాక్‌లో కూడా వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం.

New Update
Exports stopped

Exports stopped

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత వాఘా అట్టారి సరిహద్దును కూడా మూసేసింది. దీంతో పాక్‌కు ఎలాంటి వస్తువులు కూడా ఎగుమతి కావడం లేదు. దీనివల్ల ఇండియాలో కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. భారత్ నుంచి పాక్‌ను బాస్మతీ రైస్ ఎక్కువగా ఎగుమతి చేస్తోంది.

ఇది కూడా చూడండి:Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఈ ధరలు భారీగా తగ్గనున్నాయి..

ఈ బాస్మతీ రైస్ ధర ఇండియాలో కాస్త ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పుడు ఎగుమతులు ఆగిపోవడంతో వీటి ధరలు ఇండియాలో తగ్గే అవకాశం ఉంది. వీటితో పాటు పత్తి, లెదర్, టెక్స్‌టైల్స్ కూడా తగ్గనున్నాయి. పాకిస్థాన్‌కి భారత్ మందులను కూడా ఎగుమతి చేస్తోంది. ఇకపై ఎలాంటి ఎగుమతులు లేకపోవడంతో.. భారత్‌లో మందుల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. పాకిస్థాన్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయి. 

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

ఈ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృతి చెందారు. అయితే ఈ ఉగ్రవాదులలో ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారు. దీంతో మోదీ ప్రభుత్వం పాక్‌తో సంబంధాలను తెంచుకుంది. దీంతో పాక్‌లో ధరలు పెరగనుండగా.. ఇండియాలో ధరలు తగ్గుతాయి.

ఇది కూడా చూడండి:BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Advertisment
తాజా కథనాలు