అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ ఖాయం అయింది. పుతిన్ తనను కలవాలనుకుంటున్నారని స్వయంగా ట్రంపే చెప్పారు. రిపబ్లికన్ గవర్నర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. భేటీకి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. ట్రంప్ ఎప్పటి నుంచో తాను అధ్యక్షుడని అయ్యాక పుతిన్‌తో చర్చలు జరుపుతానని...రష్యా –ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగిసేలా చేస్తానని చెబుతూనే ఉన్నారు. ఇంతకు ముందు కూడా ట్రంప్ , పుతిన్ ఫోన్‌లో సంభాషించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే రష్యా ఈ విషంలో ఇప్పటి వరకు పెద్దగా ఎప్పుడూ స్పందించలేదు. కలవడం ఇష్టమని కానీ, ఇష్టం లేదని కానీ ఏదీ చెప్పలేదు. దాంతో వీరిద్దరి భేటీ సందేహమే అనుకున్నారు. Also Read: USA: హమ్మయ్యా తప్పించేసుకున్నారు...ట్రంప్ కు బేషరతు విడుదల అవును మేము సిద్ధంగా ఉన్నాము.. కానీ తాజాగా ఈరోజు రష్యాలోని క్రెమ్లిన్ కూడా ట్రంప్, పుతిన్ భేటీ నిజమేనని ఒప్పుకుంది. వారిద్దరూ త్వరలోనే కలవనున్నారని చెప్పింది. ట్రప్‌తో ఎటువంటి కండిషన్లు లేని చర్చలకు తాము ఆహ్వానిస్తున్నామని క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక చర్చలు ఉంటాయని చెప్పారు. దీంతో వీరిద్దరి కలయిక పై మరింత ఆసక్తి ఏర్పడింది ఇప్పుడు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధాన్ని ఆపేలా చేయాలని ఆయన ట్రంప్‌ను కోరిట్లు తెలుస్తోంది. దీనిపై ట్రంప్ కూడా భరోసా ఇచ్చారని...యుద్ధం ముగించేందుకు సాయం చేస్తానని చెప్పారని సమాచారం. రీసెంట్‌గా జెలెన్ స్కీ మాట్లాడుతూ రష్యా దూకుడును అరికట్టడంలో ట్రంప్ నిర్ణయాత్మక పాత్ర పోషించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. Also Read: Delhi: పరీక్షలు రాయడం ఇష్టం లేక బాంబు బెదిరింపు ఈమెయిల్స్